రెండో టెస్టుకు భారత జట్టు ఇదే .. రాహుల్ కి మళ్లీ నిరాశే !

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మొదటి మ్యాచ్ లో ఘోర పరాజయం తర్వాత కెప్టెన్ కోహ్లీ అలాగే పేసర్ షమీ జట్టుకు దూరం అయ్యారు. దాంతో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగనున్న ఈ బాక్సింగ్ డే టెస్ట్ కు అజింక్య రహానే కెప్టెన్ గా వ్యవరించనుండగా… పుజారా వైస్ కెప్టెన్ భాద్యతలు చేపట్టనున్నాడు.

ఇక ఈ మ్యాచ్ లో ఓపెనర్ పృథ్వీ షా స్థానంలో శుబ్‌మాన్‌ గిల్ ను తీసుకున్నారు. అయితే ఇదే గిల్ కు మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్. అలాగే ఏ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను ఎంపికచేయగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను మరియు మహ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకున్నారు. గిల్ తో పాటుగా సిరాజ్ కూడా ఇదే మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్. ఇక కోహ్లీ స్థానంలో కె ఎల్ రాహుల్ కు చోటు దక్కడం ఖాయం అని భావించగా అనూహ్యంగా కోహ్లీ స్థానంలో జడేజా స్థానం దక్కించుకున్నాడు.

టీం ఇండియా : అజింక్య రహానే (c), శుబ్‌మాన్‌ గిల్, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పుజారా(vc), హనుమా విహారీ, రిషబ్ పంత్ (wk), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్