అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా సమయం వచ్చేసింది. ఆస్ట్రేలియా- ఇండియా తొలి టెస్టు మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఆడిలైడ్ వేదికగా, ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి పింక్ బాల్ టెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా జట్టుతొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలవడంతో విరాట్ కోహ్లీ తన కెరీర్ లో 26 మ్యాచ్ లలో టాస్ ను గెలిచినట్లయింది. కోహ్లీ టాస్ గెలిచిన గత 25 టెస్టుల్లో ఒక్కదానిలో కూడా ఇండియా ఓడిపోలేదన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన వన్డే,టీ 20 సిరీస్‌లను చెరొక్కటి గెలిచుకుని సమానంగా నిలిచాయి. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మద్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
టీమిండియా జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, చతేశ్వర్ పూజారా, అజింక్య రహానె, హనుమా విహారీ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
ఆసీస్ జట్టు వివరాలు :జో బర్న్స్, మాథ్యూ వేడ్, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్ (w / c), కామెరాన్ గ్రీన్, టిమ్ పైన్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్