కోహ్లీ వన్డే రిటైర్మెంట్‌పై ఊహాగానాలు.. ఆ ఫోటో చూసి షాక్ అవుతున్న అభిమానులు..!

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి తెలియని.. క్రికెట్ ప్రేమికులు ఉండరు. అయితే ఇప్పుడు ఆయన లుక్‌నే చూసి అదే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా లండన్‌లో ఒక వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలో కోహ్లీ గడ్డం పూర్తిగా తెల్లగా కనిపించింది. ఈ ఫోటో చూసిన అభిమానులు ‘ఇదేం మార్పు విరాట్?’ అని ఆశ్చర్యపడిపోతున్నారు. టెస్ట్, టీ20ల్లో రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత వన్డేల్లో కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అన్న సందేహం కలుగుతోంది.

కోహ్లీ వయసు ప్రస్తుతం 36. క్రికెటర్‌గా ఇంకా రెండేళ్లు నుంచి మూడేళ్లూ ఫిట్‌గా కొనసాగవచ్చునని అనిపిస్తున్నా… ఈ తాజా లుక్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో కోహ్లీ గడ్డంలో తెల్లని రేఖలు కనిపించినప్పటికీ, ఈ ఫోటోలో అయితే ఏకంగా పూర్తిగా తెల్లగా ఉండటంతో చర్చ పెరిగింది.

గతేడాది జూలైలో అనుష్క శర్మతో దిగిన ఫోటోలోనూ ఇదే తరహాలో గడ్డంలో తెలుపు వెంట్రుకలు కనిపించాయి.. అంతేకాదు ఇటీవల యువరాజ్ సింగ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోహ్లీ తన గడ్డం గురించి సరదాగా మాట్లాడుతూ ఇప్పటికే గడ్డానికి రంగు వేయాల్సిన సమయం వచ్చిందనిపిస్తోంది అని చెప్పారు కూడా. ఇప్పుడు ఆ వ్యాఖ్యలతో పాటు ఈ ఫోటో కూడా వైరల్ కావడం, రిటైర్మెంట్ గురించి ఎప్పుడేం ప్రకటిస్తాడోనని అభిమానుల టెన్షన్ పడుతున్నారు.

కోహ్లీ వన్డే కెరీర్ ఇంకా కొనసాగుతుందా.. లేక త్వరలో మరో సంచలన నిర్ణయం తీసుకుంటాడా.. అన్నది కాలమే చెప్పాలి. కానీ ఈ ఒక్క ఫోటో మాత్రం అభిమానుల మనసుల్లో భిన్నభిన్న భావాలను రేకెత్తించింది.