సెక్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం అందుకే సెక్స్ గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని అన్ని దేశాలలో సెక్స్ పాటలను విద్యార్థుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే సెక్స్ పాఠాల విషయంలో మన ఇండియా చాలా వెనుకబడి ఉందని చెప్పాలి. కానీ సెక్స్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలకు కూడా సెక్స్ పాఠాలు చెప్పడం ఎంతో ముఖ్యమైన అంశం.
ఈ విధంగా పిల్లలకు సెక్స్ గురించి అవగాహన ఉండటం వల్ల వారు ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలను పాటించే అవకాశాలు ఉంటాయి. లేదంటే లైంగిక సంక్రమణ వ్యాధులు అవాంచిత గర్భధారణ వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.అందుకే ప్రతి ఒక్క తల్లి తండ్రి సెక్స్ గురించి తమ పిల్లల దగ్గర ఏమాత్రం సంతోషం లేకుండా మాట్లాడాలని వారికి ఈ విషయాలు తెలియచేయాలని నిపుణులు చెబుతున్నారు.అయితే చాలామంది ఇలాంటి విషయాలను పిల్లల దగ్గర ప్రస్తావించడానికి మనం చెప్పకపోయినా వారు ఇంటర్నెట్ వీడియోలు చూసి లేదా ఇతరుల నుంచి తెలుసుకుంటారు.
ఇలా ఇతరుల ద్వారా తెలుసుకొనే సమయంలో సెక్స్ గురించి సరైన విషయాలను తెలుసుకుంటారన్న నమ్మకం ఉండదు. అందుకే వారికి సరైన పద్ధతిలో వివరించాలి అయితే 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లల నుంచి వారి శరీరంలో మార్పులు మొదలవుతాయి.ఇలా మొదలైన మార్పుల వల్ల వారు చాలా అసౌకర్యంగా ఉంటారు. అందుకే ఈ సమయంలోనే పిల్లలకు సెక్స్ గురించి అవగాహన చేపడుతూ వారికి కొన్ని విషయాలను చెబుతూ జాగ్రత్తలు పాటించమని సూచించడం ఎంతో మంచిదని చెప్పాలి.