కరోనా రికవరీ రేటు: అమెరికాను కూడా వెనక్కి నెట్టిన భారత్.. ప్రపంచంలోనే నెంబర్ వన్

India tops in corona recovery rate

భారత్ లో కరోనాపై పోరు జోరుగానే ఉంది. భారత్ మొత్తం కరోనాతో బాగానే పోరాడుతోంది.. అనే విషయం కరోనా రికవరీ రేటుతో తెలుస్తోంది. నిజానికి రోజుకు వేల మంది కరోనా బారిన పడినా.. అందులో ఎక్కువ శాతం మంది రికవరీ అవుతున్నారు. మరణాల రేటు కూడా భారతదేశంలో తక్కువగానే ఉన్నది.

India tops in corona recovery rate
India tops in corona recovery rate

ఇక.. తాజా సమాచారం ప్రకారం.. కరోనా రోగుల రికవరీ రేటులో భారత్ యూఎస్ ను వెనక్కి నెట్టేసింది. అంతే కాదు.. ప్రపంచంలోనే కరోనా రోగుల రికవరీ రేటులో భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలబడింది.

దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇక్కడ ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలో ఇప్పటి వరకు దాదాపు 42 లక్షల మంది కరోనాను జయించారని పేర్కొన్నది.

ప్రపంచ వ్యాప్తంగా పోల్చి చూస్తే… ప్రపంచ వ్యాప్తంగా కోలుకున్న వారిలో ఇది 19 శాతంగా నమోదయింది. మరోవైపు యూఎస్ లో 41 లక్షల మంది కరోనాను జయించారు. అప్పటి వరకు కరోనా రికవరీ రేటులో ముందంజలో ఉన్న యూఎస్ ను భారత్ వెనక్కు నెట్టి… మొదటి స్థానంలో నిలిచింది.

కేంద్రం కరోనా పోరు కోసం చేస్తున్న  కృషి వల్లనే దేశంలో కరోనా రికవరీ రేటు 79.28 శాతానికి చేరుకున్నదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

కరోనా సోకిన వారిని వెంటనే గుర్తించడంతో పాటుగా.. వారికి వెంటనే చికిత్స అందించడంతో పాటుగా వాళ్లు కలుసుకున్న వాళ్లను కూడా గుర్తించి వాళ్లను క్వారంటైన్ చేసి… ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుండటం వల్లనే రికవరీ రేటు విపరీతంగా పెరిగిపోతోందంటూ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

కరోనా కేసుల్లో రెండో స్థానంలో భారత్

ప్రస్తుతం కరోనా కేసుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలో ఉన్న కరోనా కేసుల్లో 17 శాతం భారత్ లో వచ్చినవే. దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన కేసులు సుమారు 53 లక్షలు. వీరిలో 42 లక్షల మంది కోలుకున్నారు. మరో 10 లక్షల 13 వేల కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో భారత్ లో మరణించిన వారి సంఖ్య సుమారు 85 వేలు.