Ramayana: దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమా.. పార్ట్ 1 కోసమే ఏకంగా అన్ని వందల కోట్లు ఖర్చు!

Ramayana: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా బాలీవుడ్ మూవీ రామాయణ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ గ్లింప్స్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి అంటూ ప్రశంసల కురిపిస్తున్నారు అభిమానులు. ఇప్పటికే రామాయణ సినిమాకు సంబంధించి వినిపించిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకుంటుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. అయితే రామాయణం సినిమా ఆధారంగా ఇప్పటికే చాలా సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే. కానీ, గ్రాఫిక్స్‌ వర్క్‌ ప్రధాన బలంగా ఒక అద్భుతాన్ని దర్శకుడు నితేశ్‌ తివారీ వెండితెరపై చూపించనున్నాడు. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది.

ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో రామాయణ పేరుతో అత్యంత భారీ బడ్జెట్‌ పేరుతో సినిమా వస్తుంది. అన్ని యుద్ధాల్ని అంతం చేసే యుద్ధం మొదలైందని తాజాగా విడుదలైన రామయణ గ్లింప్స్‌లో మేకర్స్‌ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ చిత్రంతో బాక్సాఫీస్‌ రికార్డ్‌ లు అన్నీ అంతం కావడమే కాకుండా కొత్త రికార్డ్‌ మొదలైంది. రామయణ పార్ట్‌1 కోసం ఏకంగా రూ. 835 కోట్ల బడ్జెట్‌ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా రామాయణ చరిత్ర సృష్టించింది. రాకింగ్ స్టార్ యశ్‌ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్‌ చిత్రాలుగా నిలిచిన కల్కి 2898 ఏడీ రూ. 600 కోట్లు, ఆర్ఆర్ఆర్ రూ. 550 కోట్లు, ఆదిపురుష్ రూ. 550 కోట్లు వంటి చిత్రాలను రామాయణ అధిగమించింది. దీంతో ఈ సినిమా బడ్జెట్ గురించి కూడా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. కేవలం పార్ట్ 1 కోసమే ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారా అంటూ షాక్ అవుతున్నారు.