Crime News: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. తల్లి పొత్తిళ్ళలో ఉండాల్సిన శిశువును అమ్మిన కుటుంబ సభ్యులు…!

Crime News: కొందరు వ్యక్తులు ప్రేమ పేరుతో మోసపోయి బిడ్డలని కనీ అభం శుభం తెలియని ఆ పసి పిల్లలను చెత్తకుప్పల్లో చెట్ల పొదలలో ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం.కానీ కొంతమంది తల్లిదండ్రులు కొన్ని వ్యక్తిగతమైన కారణాల వల్ల వారికి పుట్టిన బిడ్డలను అమ్మేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తల్లికి తెలియకుండా అప్పుడే పుట్టిన పసికందును కుటుంబ సభ్యులు అమ్మేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే… పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి మండలం, అల్లిపల్లి గ్రామానికి చెందిన గంటా అరుణ్ కుమార్, చిలకమ్మ దంపతులకు ఈనెల 3న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , అశ్వారావుపేట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగ బిడ్డ జన్మించాడు. అయితే అరుణ్ కుమార్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ సహాయంతో ఈనెల 7వ తేదీన చిలకమ్మ కు తెలియకుండా ఆ బిడ్డను విశాఖకు చెందిన వారికి  రెండు లక్షల రూపాయలకు అమ్మేశారు.

అరుణ్ కుమార్ తల్లి మేరీ అంగన్వాడీ కేంద్రంలో తమ కోడలికి రావాల్సిన పాలు గుడ్లు గురించి అడగగా.. పిల్లాడు ఎక్కడ ఉన్నాడు అని అధికారులు ప్రశ్నించారు.ఈ క్రమంలో మీది ఒక సారి బాలుడు మరణించాడు అని మరొకసారి ఇంట్లో ఉన్నాడు అని చెప్పటంతో అధికారులకు సందేహం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులుఅరుణ్ కుమార్, మేరి లను విచారించగా.. రెండు లక్షల రూపాయలకు శిశువును విక్రయించినట్లు వారు వెల్లడించారు.

ఈ క్రమంలో చిలకమ్మ తన బిడ్డ ఎక్కడున్నాడో చెప్పాలని పలుమార్లు తన భర్తని ఆర్ఎంపీ డాక్టర్ ని కోరిన వారు పిల్లాడే ఆచూకీ వారు చెప్పటం లేదని తెలిపింది. పిల్లాడిని చూస్తే లేనిపోని ప్రేమలు పుట్టుకొస్తాయని వారు బెదిరిస్తున్నారని పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలో బిడ్డ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టిన అశ్వారావు పేట పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసి బిడ్డ ఆచూకీ తెలుసుకున్నట్లుగా సమాచారం. పసిబిడ్డను బిడ్డను తల్లి ఒడికి చేర్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.