Crime News: మృత్యు ఎప్పుడు ఎవరిని ఎలా కనిపిస్తుందో చెప్పలేము. నిమిషాలలో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. బంధుమిత్రులందరితో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొని సంతోషంగా గడుపుతున్న సమయంలో వారి ఆనందం ఆవిరైపోయింది. పెళ్లి వేడుక పూర్తి కాకుండానే విషాద చాయలు అలముకున్నాయి. ఎంతో ఆనందంగా పెళ్లి లో పాల్గొని బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతున్న సమయంలో మృత్యువు వారిని కబళించింది. వివరాలలోకి వెళితే వివరాలలోకి వెళితే..ఖుషీనగర్ జిల్లా నెబువా నౌరంజియాలో వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది.
వివాహ వేడుకల్లో భాగంగా బంధుమిత్రులు అందరూ కలిసి హల్దీ ఫంక్షన్ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న ఆ సమయంలో కొంతమంది మహిళలు వేడుకను చూడటానికి సమీపంలో ఉన్న బావి పై కప్పు మీద నిలుచున్నారు. పెళ్లి హడావిడిలో బావి ఎటువంటి పరిస్థితుల్లో ఉందో గమనించకుండా ఎక్కువ సంఖ్యలో జనాలు బావి పైకప్పు మీద నుల్చుకోవడటం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. బావి పైకప్పు మీద నిలబడి కార్యక్రమాన్ని చూస్తున్న సమయంలో అధిక బరువు వల్ల బేబీ పై కప్పు ఒక్కసారిగా కూలిపోయింది. కళ్ళు మూసి తెరిచేలోపు ఈ ఘోరం జరిగిపోయింది.
పైకప్పు మీద నిలుచొని ఉన్నా మహిళలు 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక 15 మందిని గ్రామస్తులు రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు .వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ బాధాకర సంఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు.