Crime News: వరంగల్ జిల్లా అడవిరంగాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది ది. ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారు మరణించడంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈత రాదని తెలిసినా కూడా బాలుడిని కాపాడే ప్రయత్నంలో బాలుడి తండ్రి తాత ఒకరి తర్వాత ఒకరు నదిలోకి దూకి బాలుడితో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
వివరాలలోకి వెళితే..వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చిన్నగురిజాల గ్రామానికి చెందిన వెంగళదాసు కృష్ణమూర్తి, విజయ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.కుమారుడు నాగరాజుకు దీపక్, నాగరాజు అనే 12 ఏళ్ల వయసున్న కవలలు ఉన్నారు.కృష్ణమూర్తి కి దుగ్గొండి మండలం, అడవి రంగాపురం గ్రామ శివారులోని సాగుభూమి ఉంది. ఆదివారం కుటుంబసభ్యులందరూ కలిసి పొలానికి వెళ్ళారు. మధ్యాహ్నం భోజనం కోసం పక్కనే ఉన్న రాళ్లకుంట చెరువు వద్దకు కాళ్లు చేతులు కడుక్కునేందుకు వెళ్లారు.
ఈ క్రమంలోనే నాగరాజు కుమారుడు దీపక్ ప్రమాదవశాత్తు జారి చెరువులో పడ్డాడు. ఇది గమనించిన తాత కృష్ణమూర్తి తనకి ఈత రాకపోయినా దీపక్‌ను కాపాడేందుకు నీళ్లలోకి దిగారు. ఇద్దరూ చెరువులో పడిపోయి కేకలు వేయడంలో ఆ ఇద్దరిని కాపాడేందుకు నాగరాజు కు కూడా ఈత రాకపోయినా చెరువులో దిగాడు. ఈత రాక ముగ్గురూ చెరువులో మునిగిపోయారు. క్షణాలలో ఇలా ముగ్గురు చెరువులో మునిగిపోయి మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీరి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు.