కృష్ణజిల్లా గన్నవరం నియోజక వర్గం నుండి టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ మోహన్ ఇప్పుడు వైసీపీ రాజకీయాల్లో అంతర్యుద్ధం సృస్తిస్తున్నారు. టీడీపీ నుండి గెలిచిన వంశీ ఇప్పుడు టీడీపీకి రెబల్ గా మరి చంద్రబాబు నాయుడును, టీడీపీని ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గర తన నిబద్ధతను నిరూపించుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు. వైసీపీ నాయకులు కూడా వంశీ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు గన్నవరంలో ఆధిపత్య పోరు నడుస్తుంది. నియోజకవర్గంలో నిన్నటి వరకు ఉన్న ప్రశాంత వాతావరణం.. చెల్లా చెదురైంది.
వైఎస్సార్ సీపీ నాయకుడు దుట్టా రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు పార్టీలోను, నియోజకవర్గంలోను కూడా కలకలం రేపాయి.
టీడీపీ నుండి వైసీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న వంశీ నియోజక వర్గంలో పెత్తనం చేలాయించడానికి ప్రయత్నిస్తున్నారని, నేను వంశీలా జెండాలు మార్చినవాడిని కాదని, నాది ఒకే జెండా , అది వైసీపీ జెండానే అని వ్యాఖ్యానించారు. నా తరువాత నా బిడ్డలు కూడా వైసీపీ వెంటే, జగన్ వెంటే ఉండాలనుకునే వాడిని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఎన్నో కేసులు పెట్టారు. భయపడలేదు. ఇపుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు’ అంటూ.. దుట్టా విరుచుకుపడడం రాజకీయంగా సంచలనానికి దారితీసింది.
ఈ గొడవల వల్ల గన్నవరంలో ఇప్పుడు ఒక రకమైన అంతర్యుద్ధం జరుగుతుంది. అధికారులకు కూడా ఎవరి మాట వినాలో అర్ధం కావడం లేదు. ఈ గోడవలపై జగన్ మోహన్ రెడ్డి దాకా చేరాయి. రానున్న రోజుల్లో ఈ గోడవలపై క్లారిటీ ఇవ్వనున్నారు. వంశీ, దుట్టాలలో ఎవరికో ఒకరికి నియోజక వర్గ అధికారం ఇవ్వనున్నారని సమాచారం.