NTR – Charan: టాలీవుడ్ ఆ ఇద్దరు హీరోలను చూస్తే అసూయ వేస్తుంది… షాకింగ్ కామెంట్స్ చేసిన తమిళ స్టార్ హీరో!

NTR – Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు కలిసి తాజాగా నటించిన చిత్రం RRR. ఇలా వీరిద్దరూ కలిసి ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు.అయితే ఈ సినిమా ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇకపోతే ఈ సినిమాలో చరణ్ ఎన్టీఆర్ ఎంతో సన్నిహితంగా ఉన్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్ ,పోస్టర్లు చూస్తే అర్థమవుతుంది.

అయితే ఈ సినిమాను జనవరి 7వ తేదీ విడుదల చేయాలన్న ఉద్దేశంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చేశారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎంతో సన్నిహితంగా ఉండడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి ఒక తమిళ హీరో ఎంతో అసూయ పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే…

తమిళ స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మాధవన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చరణ్, తారక్ స్నేహబంధం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోని మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది. అలాగే గర్వంగా కూడా వుంది అంటూ తెలియజేశారు.
హాట్సాఫ్. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. భారతీయ సినిమా చరిత్రను ఈ సినిమాతో తిరగ రాస్తారు అని పేర్కొన్నారు. ఇలా ఈ హీరో ట్వీట్ చేయడంతో చిత్రబృందం స్పందిస్తూ.. థాంక్యూ మ్యాడీ సర్!.. మేం కూడా అందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభంజనం సృష్టించేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం అంటూ రిప్లై ఇచ్చారు.