తెలంగాణలో దుబ్బాక ఎన్నికలు ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలు కూడా అంతే ఆసక్తిగా మారనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ పోటీ చేయనున్న అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు తన చీకటి రాజకీయాలను చేయనున్నారని సమాచారం.
చంద్రబాబు చీకటి రాజకీయం
చంద్రబాబు నాయుడు మార్కు రెండుకళ్ల సిద్ధాంతం తిరుపతి బై పోల్ లో కూడా అనుసరించబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత తన పార్టీ కోసమే పని చేసినా.. అక్కడ ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవు. అలాకాకుండా.. చంద్రబాబు నాయుడు తన రొటీన్ రాజకీయాన్ని చేశారంటే అంతే సంగతులు! అంటే తన పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపి.. మరొక పార్టీ అభ్యర్థి కోసం లోలోపల సహకారం అందించడం ఇదీ చంద్రబాబు నాయుడి మార్కు రాజకీయం. గతంలో 18 స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు చాలా చోట్ల తెలుగుదేశం క్యాడర్ పూర్తిగా కాంగ్రెస్ కోసం పని చేసింది. అప్పట్లో జగన్ కు పగ్గాలు వేయాలనే లెక్కలతో టీడీపీ డిపాజిట్లను సైతం కోల్పోయి కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లను కట్టబెట్టింది.
బాబుకు లక్ష్మీ షాక్ ఇవ్వనుందా!!
చంద్రబాబుకు ఎలాగూ ఈ చీకటి రాజకీయాలు కొత్త కాదు కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి మద్దతు ఇవ్వనున్నారని స్పష్టంగా అర్ధం అవుతుంది. ఈ పరిణామాల్లో తాను కోరని టికెట్ ను తనకు కేటాయించి చంద్రబాబు నాయుడు తనదైన రాజకీయంతో ఉన్న పరువు కూడా పోయేలా చేయనున్నారని లక్ష్మీ భావిస్తున్నారట. అందుకే ఆమె అదును చూసి తిరుపతి ఎన్నికల పోటీ తప్పుకోనుందని సమాచారం.