సైమా అవార్డ్స్ లో పుష్ప సినిమాకి అవార్డుల వెల్లువ.. ఎన్ని అవార్డ్స్ దక్కించుకుందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలై ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల టాలీవుడ్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసింది. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ లో రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అంతే కాకుండా పుష్ప సినిమా లో అల్లు అర్జున్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ఇక ఈ సినిమాలోని పాటలు కూడా సినిమాకూ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ఒకటేమిటి ఈ సినిమాలో ప్రతి అంశం ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సైమా అవార్డు వేడుకలు బెంగళూరులో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పుష్ప సినిమా తన సత్తా చాటుకుంది. ఈ ఏడాది పోల్స్ ద్వారా సైమా అవార్డుల ఎంపిక జరగగా.. పుష్ప సినిమా అనేక అంశాలలో అవార్డులు తగ్గించుకుంది.

సైమ అవార్డులలో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు,ఉత్తమ సహా నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సాహిత్య రచయిత ఇలా మొత్తం ఆరు కేటగిరీల్లో పుష్ప సినిమా సైమా అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు అందుకోగా ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఈ అవార్డు ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పుష్ప సినిమా ఆరు అవార్డులు దక్కించుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.