Crime News: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం.. వాతావరణ కాలుష్యం పెరుగుతుండటం వల్ల చాలామంది వాతావరణాన్ని కాపాడే దిశగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తమిళనాడులో ఎలక్ట్రిక్ బైక్ చార్జింగ్ పెట్టగా బైక్ లో వంటలలో చెలరేగి తండ్రి, కూతురు దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళితే…తమిళనాడులోని , వేలూరు జిల్లా, అల్లాపురం లో నివాసం ఉంటున్న దురైవర్మ మూడు రోజుల క్రితం తిరువణ్ణమలై జిల్లా, పోలూరు సమీపంలోని ఓ ఎలక్ట్రిక్ బైక్ డీలర్‌షాపులో 95వేల రూపాయలతో ఒక ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశాడు. ఆ బైక్ ఇంటికి తీసుకొచ్చి రాత్రి నిద్రపోయే ముందు ఛార్జింగ్ పెట్టి పడుకున్నారు. అయితే ఎంతో కష్టపడి తీసుకున్న ఆ ఎలక్ట్రిక్ బైక్స్ వారి ప్రాణాలు తీస్తుంది అని వారికి తెలియదు పాపం. రాత్రిపూట ఎలక్ట్రిక్ బైక్ కి చార్జింగ్ పెట్టి పడుకోకు కొంత సమయం తర్వాత బైక్ లో మంటలు చెలరేగాయి. బైక్ పక్కనే ఉన్న పెట్రోల్ బైక్ కి కూడా మంటలు అంటుకొని ఇల్లు మొత్తం వంటలు అలుముకున్నాయి.
అయితే అచ్చంపేట మంచి గాఢ నిద్రలో ఉన్న దురై వర్మ అతని కూతురు ఈ ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. ఇల్లు మొత్తం వంటలు వ్యాపించటంతో తండ్రి కూతురు ఇద్దరూ మంటల్లో చిక్కుకున్నారు. మంటలను గమనించిన స్థానికులు వారిని కాపాడటానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంటి చుట్టూ మంటలు వ్యాపించడంతో వారిని కాపాడలేకపోయారు. వెంటనే కొందరు స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అక్కడికి చేరుకుని సిబ్బంది మంటలను లోపలికి వెళ్లి చూడగా తండ్రి కూతురు ఇద్దరు మంటల్లో కాలి సజీవదహనమయ్యారు. ప్రస్తుతం ఈ ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.