ఈ లెక్కన ఆమె ఓట్ కూడా చెల్లదుగా మరి.??

ఎంతో కాలం నుంచో మరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు నిన్నటితో ముగిసిపోయాయి. ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు ల నడుమ ఎంతో రసవత్తర పోటీ నడుమ మంచు విష్ణు ఊహించని విధంగా విజయ బావుటా ఎగురవేశాడు. అయితే నిన్న ఎన్నికల రోజు ఇంత కాలం తిట్టుకొని సెల్ఫీలు దిగినా అది అక్కడి వరకే కానీ పోటీ సమయంలో అందరూ చెప్పిన మాటలు గుర్తుంచుకోక తప్పదు.

అసలు ముందు నుంచి కూడా ప్రకాష్ రాజ్ పై లోకల్ నాన్ లోకల్ అనే నినాదంతోనే అంతా మొదలయింది. అలాంటప్పుడు మంచు విష్ణు కోసం ఎప్పుడో బాలీవుడ్ లో సెటిల్ అయ్యినటువంటి జెనీలియా వచ్చి ఓట్ వేసింది. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమె తెలుగు అమ్మాయి కాదు కాదా? ప్రకాష్ రాజ్ లానే.. సో విష్ణు విషయంలో ఆమె ఓట్ ఎలా చెల్లుతుంది అని నిపుణులు వేస్తున్న లాజికల్ ప్రశ్న.

అలాగే ఇదే రకంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో కొంతమంది కూడా ఉన్నారు వారి ఓట్లు కూడా చెల్లకూడదు కదా అనేది మరో ప్రశ్న. అందుకే ఇలాంటివి వస్తాయనే మొదటి నుంచి పెద్దలు మొత్తుకుంటున్నారు. కానీ ఫైనల్ గా ఈ కారణాల వల్లే ప్రకాష్ రాజ్ ఓడిపోయాడని క్లియర్ గా అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇక టాలీవుడ్లో మంచు వారి ప్రస్థానం ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.