Crime News: ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనుషుల మధ్య మానవ సంబంధాలు పూర్తిగా నశించాయి. మేలు చేసిన వారికి కీడు తలపెట్టే దుర్మార్గులు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఆపదలో ఆదుకున్న వారికి తిరిగి సాయం చేయకపోయినా పరవాలేదు కానీ వారికి ఆపద తలపెట్ట కూడదు. కానీ ఇటీవల కామారెడ్డి జిల్లాలో అప్పు ఇచ్చిన పాపానికి ఒక మహిళ మీద నీచుడు దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే…ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు మహిళ మీద అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇటీవల కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా బిబిపేట్‌లో చెందిన శిరీష అనే మహిళ
తెలిసినవాడు కదా అని గణేష్ అనే వ్యక్తికి రెండున్నర లక్షలు అప్పు ఇచ్చింది. గత కొన్ని రోజులుగా శిరీష తన అప్పు తిరిగి చెల్లించమని గణేష్ తరుచు అడుగుతూ ఉండేది . ఈ క్రమంలో తరుచు శిరీష డబ్బులు తిరిగి ఇవ్వమని అడగటం తో ఆమె మీద కక్ష పెంచుకున్న గణేష్ ఒక పథకం ప్రకారం ఆమెను గ్రామ శివారులోని పొదలలో కి తీసుకెళ్ళి దారుణానికి పాల్పడ్డాడు.
శిరీషను పొదల్లోకి తీసుకువెళ్లి ఆమెపై దాడి చేసి చితకబాదాడు. గణేష్ కొట్టిన దెబ్బలకు శిరీష సృహ తప్పి పడిపోయిన తర్వాత ఆమె మీద అత్యాచారం చేసి ఆఖరికి ఆమెను హత్య చేయటానికి కూడా ప్రయత్నించాడని బాధితురాలు పోలీసులకు తన బాధను వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.