Crime News: చాలా మంది పామును చూడగానే ఆమడ దూరం పారిపోతుంటారు. మరి కొంతమంది మాత్రం పాము కనిపించగానే వాటిని అవలీలగా పట్టుకొని వాటిని ఆడిస్తుంటారు. మణుగూరుకు చెందిన యువకుడు ఇలా పాములు ఎక్కడ కనిపించినా అవలీలగా పట్టడం వదిలేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల సామాను పట్టి ఆడిస్తుండగా దాని కాటుకు గురై ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,మన గురువు కు చెందిన షరీఫ్ అనే యువకుడు ఎలక్ట్రిక్ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. పరిసర ప్రాంతాలలో ఎక్కడ పాములు కనిపించిన కూడా షరీఫ్ ను పిలిపించి వాటిని పట్టుకుని అడవి ప్రాంతంలో వదిలేసేవారు. ఈ క్రమంలోనే మంగళవారం రోజు సమితిసింగారంలోని ఓ బావిలో త్రాచు పాము పడిందనీ సమాచారం అందుకున్న షరీఫ్ అక్కడికి వెళ్లి చాకచక్యంగా పాము ని పట్టుకుని బయటికి తీశాడు.
ఈ క్రమంలో షరీఫ్ కొంతసేపు పామును ఆడిస్తున్న సమయంలో త్రాచు పాము అతడి కుడి చేతిపై కాటేసింది. పాము కాటు వేసినప్పటికీ షరీఫ్ నిర్లక్ష్యం వహిస్తూ హాస్పిటల్ కి వెళ్ళకుండా గంటకు పైగా సమయం వృధా చేశాడు. ఈ క్రమంలో కొంతసేపటి తర్వాత షరీఫ్ నురగలు కక్కుకుంటూ కుప్పకూలాడు. వెంటనే స్థానికులు చికిత్సకోసం షరీఫ్ ని కరకగూడెం ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పాము కాటువేయగా అనే సరైన సమయంలో షరీఫ్ హాస్పిటల్ కు వెళ్ళింటే ఇలా ప్రాణాలు కోల్పోవల్సి వచ్చేది కాదని స్థానికులు వెల్లడించారు.