Crime News: ఇటీవల బెంగళూరు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదహారేళ్ల మైనర్ బాలిక మీద నలుగురు వ్యక్తులు ఆరు రోజుల నుండి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. వివరాలలోకి వెళితే.. బెంగళూరులోని బండెపాల్య లో నివాసం ఉండే ఇద్దరు టైలర్లు ఒక అమ్మాయిని బెదిరించి రేప్ చేయించారు. బాలిక ఆరోగ్యం క్షీణించడం గమనించిన బాధితురాలి తల్లి, ఆ బాలికను ఆసుపత్రికి తీసుకు వెళ్లి పరీక్షలు చేయించగా విషయం బయటకు వచ్చింది. విషయం తెలిసిన తల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై పలుమార్లు లైంగికదాడి జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజేశ్వరి , కళావతి అనే ఇద్దరు మహిళలు సదరు బాలిక ఇంటి దగ్గర లోనే నివాసం ఉండేవారు. బాలిక స్కూల్ అయిపోయిన అనంతరం రాజేశ్వరి దగ్గరకు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేది. బాలిక తెలిపిన వివరాల మేరకు ఫిబ్రవరి 28న బాలికకు రాజేశ్వరి జ్యూస్ లో మత్తుమందు కలిపి ఇచ్చింది . జ్యూస్ తాగిన బాలిక సృహ తప్పి పడిపోవడంతో కేశవమూర్తి అనే వ్యక్తి ఆ అమ్మాయి మీద లైంగికదాడి చేశాడు. ఆ అమ్మాయికి సృహ వచ్చిన అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని, ఆ విషయం ఎవరికీ చెప్పకూడదు అని బెదిరించింది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత రాజేశ్వరి సదరు బాలికను కళావతి ఇంటికి తీసుకు వెళ్ళింది. అక్కడ రఫీక్, సత్యరాజ్, శరత్ అనే ముగ్గురు యువకులు బాలిక మీద పలుమార్లు అత్యాచారం చేశారు.
బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని తెలియడంతో రాజేశ్వరి, కళావతి అక్కడి నుండి పారిపోయారు. మార్చి ఏడో తేదీన వీరిని నగర శివార్లలో పట్టుకున్నారు. పోలీసులు వారి స్టైల్ లో విచారణ చేయగా సదరు మహిళలు మరొక నలుగురి వివరాలను పోలీసులకు అందజేశారు. ఈ నలుగురిని ఒకరి తర్వాత ఒకరిని అరెస్టు చేసి మార్చి 8న కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు వీరిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచినట్టు పోలీసులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఆరుగురి మీద ఫాక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రాజేశ్వరి, కళావతి సెక్స్ వర్కర్స్ అని, లైంగిక దాడి తర్వాత నలుగురు నిందితుల నుండి డబ్బులు వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో తెలిపారు. హోసూర్ కు చెందిన కేశవమూర్తి ఆటోమొబైల్ కంపెనీ లో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నాడు…. కోరమంగళ కు చెందిన సత్యరాజు కాంట్రాక్టర్, బేగూరు కు చెందిన రఫీక్, ఎలాహంక కు చెందిన శరత్ లు వ్యాపారస్తులు అని పోలీసులు తెలిపారు.