టీడీపీ ఎమ్మెల్యేలను పట్టించుకోని అధికారులు, వైసీపీ ఇంచార్జ్ లే ఎమ్మెల్యేలా!!

ప్రస్థుత రాజకీయాల్లో అధికారులు కూడా అధికారంలో ఉన్న పార్టీ నేతలకే విలువ ఇస్తున్నారు. అధికారంలో లేని పార్టీ యొక్క ఎమ్మెల్యేను కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. టీడీపీ 23 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో నలుగురు వైసీపీలో చేరిపోయారు. ప్రస్తుతం 18 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 18 మంది ఎమ్మెల్యేలు కూడా పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలు అధికారం మొత్తం వైసీపీ నాయకులదే. చివరికి అధికారులు కూడా టీడీపీ ఎమ్మెల్యేల మాటలు వినడం లేదు.

jagan and cbn telugu rajyam
jagan and cbn telugu rajyam

టీడీపీ చేసిందే వైసీపీ చేస్తుంది

గతంలో టీడీపీ నాయకులు కూడా వైసీపీ ఎమ్మెల్యేల మాటలు వినవద్దని, టీడీపీ నాయకులకు మాత్రమే పనులు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా అలాగే చేస్తున్నారు. పద్దెనిమిది నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు నామమాత్రమే అని చెప్పుకోవాలి. అధికారులు సయితం వీరి మాట వినడం లేదు. అక్కడ ఓడిపోయిన వైసీపీ ఇన్ ఛార్జి మాత్రమే పెత్తనం సాగిస్తుండటం విశేషం. నియోజవర్గంలో ఏ పని కావాలన్నా ఇన్ ఛార్జిని మాత్రమే సంప్రదించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు అందడంతో టీడీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉత్సవ విగ్రహాలుగానే మారారు. కేవలం అధికారిక సమావేశాలకు మాత్రమే వారికి ఆహ్వానం అందుతుంది.

అచ్చెన్నాయుడుకు కూడా వైసీపీ సెగ తగిలింది

achennaidu telugu rajyam
achennaidu telugu rajyam

టీడీపీ ప్రెసిడెంట్ అయిన అచ్చెన్నాయుడు కూడా వైసీపీ నేతల నుండి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. టెక్కలిలో కూడా వైసీపీ ఇంచార్జ్ లు పెత్తనం చేస్తున్నారు. అధికారులు కూడా ఎవ్వరు అచ్చెన్నాయుడు దగ్గరకు వెళ్లకూడదని వైసీపీ నాయకులు ఆదేశాలు జారీ చేశారని,వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ అనధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారట. టీడీపీ ప్రెసిడెంట్ నియోజక వర్గంలో కూడా ఇలా వైసీపీ నాయకులు నాయకులు పెత్తనం చేస్తుంటే టీడీపీ నాయకుల రగిలిపోతున్నారని సమాచారం. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే తప్ప టీడీపీ నాయకులు తమ నియోజకవర్గాల్లో పెత్తనం చేలాయించలేరని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.