Kadambari Kiran: ఒక మనిషిగా కెరీర్ పరంగా కుంగి, కృశించిపోయానని, ఒళ్లంతా గాయాలు, అవమానాలను ఎదుర్కొన్నానని నటుడు కాదంబరి కిరణ్ అన్నారు. ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత టైం పడుతుందో, ప్రీ ప్రొడక్షన్‌కు అంత కన్నా 3 రెట్లు టైం పడుతుందని ఆయన చెప్పారు. ఆ కెరీర్ కూడా పోయిందని ఆయన చెప్పారు.
ఒకరోజు ఒక ఛానెల్‌లో ఓ ప్రోగ్రామ్ గురించి పద్మాలయలో సెట్టింగ్స్ వేశామని కిరణ్ చెప్పుకొచ్చారు. అప్పట్లో రెండు రాష్ట్రాల్లో కలిపి 545 ఆర్కెస్ట్రాలుండేవన్న ఆయన, వాటిలో 39 ఆర్కెస్ట్రాలను పిలుపించుకొని, వాళ్లకు కావల్సిన ఏర్పాట్లు, వాహనాలు కూడా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అవన్నీ చేశాక అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది అని ఏదో కారణంగా చెప్తే ఆ రోజు షూటింగ్ కూడా ఆపేశామని, తరువాతి రోజు పెద్ద క్లాత్‌తో దాన్ని కవర్ చేస్తే, అప్పుడు వాళ్లు షూట్ చేసి, వాళ్లే ఎడిటింగ్ చేసుకొని, అంతా చేసి ఇలా ఉండాలని చెప్తే, 14 ఎపిసోడ్లు ఎడిట్ చేశామని ఆయన చెప్పారు.
ఆ తర్వాత తాను ఛానెల్‌కు వెళ్తే, అప్పుడు వాళ్లు భయ్యా.. కాన్సెప్ట్ ఇది కాదు కదా అని అన్నారని, అప్పటివరకూ కూర్చున్న తాను అలాగే పడిపోయానని ఆయన అన్నారు. అది చూసి వాళ్లు తాను చనిపోయాడేమోనని అనుకున్నారని కిరణ్ చెప్పారు. నిజంగా తనకు ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయిందని, ఎందుకంటే 14 ఎపిసోడ్లకు దాదాపు 25 లక్షలు పెట్టానన్న ఆయన, కాన్సెప్ట్ ఇది కాదు అని చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలా పడిపోయిన తాను అసలు ఎలా ఇంటికి వచ్చానో కూడా తెలియదని, దాదాపు 9 రోజులకు వరకు ఫీవర్ ఉందని ఆయన తెలిపారు. అలా తాను ఎంతో పోరాడితే ఆ ఛానెల్ వాళ్లు 8 లక్షలు ఇచ్చారని, ఇంత కుళ్లు రాజకీయాలు ఎందుకు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.