Food For Sleep: మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం ప్రతిరోజు నిద్రపోవడం కూడా అంతే అవసరం. రోజుకు మనిషి కచ్చితంగా 8 గంటల సేపు నిద్రించాలి. రోజుకి సరిపడ నిద్ర లేకపోతే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కొంతమందికి పని ఒత్తిడి వల్ల నిద్రించడానికి సమయం దొరకక ఇబ్బంది పడుతుంటే.. మరికొంతమంది మాత్రం నిద్రించడానికి సమయం ఉన్నా కూడా నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
పాలు మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడతాయో అందరికీ తెలిసిన విషయమే.. ప్రతిరోజు పాలు తాగటం వల్ల ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు లభించే మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ప్రతిరోజు రాత్రి నిద్రపోయేముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. పాలలో న్యూరోట్రాన్స్ మీటర్స్ ఉండటం వల్ల తొందరగా నిద్ర పడుతుంది.
ఈరోజు రాత్రి భోజనం తిన్న తర్వాత అరటిపండు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు అరటి పండు తినటం వల్ల అరటి పండులోని పొటాషియం ,మెగ్నీషియం ,కార్బోహైడ్రేట్స్ వంటివి అధిక ఒత్తిడిని తగ్గించి హాయిగా నిద్రించే ఎలా చేస్తాయి.
ప్రతి రోజు పడుకునే ముందు కివి ఫ్రూట్స్ తినడం వల్ల అందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సెరోటిన్ లెవెల్స్ పెంచుతాయి. తద్వారా రాత్రివేళ హాయిగా నిద్ర పడుతుంది. నిద్రపోయే ముందు బాదం వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల వీటిలో ఉండే మెగ్నీషియం, మెలటోనిన్ వంటివి కండరాలను రిలాక్స్ చేసి హాయిగా నిద్రపడుతుంది.