ఆ కోరిక తీరకుండానే చనిపోతానేమో అనుకున్నా… విష్ణు ప్రియ కామెంట్స్ వైరల్!

ప్రముఖ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మోడల్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ క్రమంలోనే బుల్లితెరపై పోవే పోరా అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా పరిచయమైన విష్ణుప్రియ అనంతరం పలు ఇతర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఈమెకు ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు.

ఇలా సినిమా అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న ఈమెకు వాంటెడ్ పండుగాడ్ సినిమాలో అవకాశం కల్పించారు. రాఘవేంద్ర రావు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్, దీపికా పిల్లి జంటగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అనసూయ విష్ణుప్రియ వంటి తదితరులు కీలక పాత్రలో సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. తాజాగా చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొని ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ మీడియా సమావేశంలో భాగంగా విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. తాను హీరోయిన్ గా నటించక ముందే చనిపోతానేమోనని ఆ కోరిక తీరదేమోనని, భయపడినట్లు ఈమె తెలిపారు. అయితే రాఘవేంద్రరావు వల్ల తన కోరిక నెరవేరిందని ఈ సందర్భంగా విష్ణుప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఈ సినిమా ద్వారా విష్ణుప్రియ ప్రేక్షకులను ఎలా సందడి చేయనుందో తెలియాల్సి ఉంది.