Sugarcane Juice: వేసవి కాలం మొదలైంది. వేసవి కాలం వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరూ కూడా చల్లని పదార్థాలు చల్లని పానీయాలు తినాలి, తాగాలి అని కోరుకుంటూ ఉంటారు. వేసవి కాలంలో ఎక్కువగా శీతల పానీయాలు తాగాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే వేసవికాలంలో బయట దొరికే పానీయాల కంటే కొబ్బరి నీరు, చెరుకు రసం మజ్జిగ లాంటి పానీయాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇవి దాహార్తిని తీర్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తాయి. ఇకపోతే వేసవి కాలంలో ఎక్కువగా చెరుకు రసం తాగడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. చెరుకు రసం లో అల్లం నిమ్మకాయ కలిపి తాగితే ఆ మజానే వేరు.
ఈ చెరుకు రసం వేసవిలో తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చెరకులో ఎక్కువ శాతం కాల్షియం ఉండటం వల్ల ఆ క్యాల్షియం ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే చిన్నపిల్లల వెన్నెముక ను బలంగా మార్చి ఎదుగుదలకు చక్కగా దోహదపడుతుంది. వేసవిలో అలసట గా ఉన్నప్పుడు తక్షణ శక్తి కోసం గ్లాసు చెరకురసం తాగడం ఎంతో మంచిది. ఇందులో ఉండే సూక్రోజు కారణంగా నీరసాన్ని తగ్గించి శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. అదేవిధంగా కాలేయంలో చేరే వ్యర్ధాలను తొలగించడానికి చెరుకు రసం బాగా ఉపయోగపడుతుంది. గ్లాసు చెరకురసానికి అరచెక్క నిమ్మరసాన్ని కలిపి రోజుకు రెండు సార్లు తాగడం వల్ల , కాలేయ పని తీరు మెరుగుపడడంతో వేసవిలో వడదెబ్బ తగలకుండా పిల్లలకు ఉపశమనాన్నీ కూడా ఇస్తుంది.
అలాగే పిల్లల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి రక్షణ ఇస్తుంది. అలాగే జీర్ణాశయంలో పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేసే పొటాషియం చెరకు రసంలో ఉంది. దీంతో ఇది అజీర్తిని పోగొట్టి, జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరంలో అధికబరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికీ చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంద. ఈ రసం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. గొంతు నొప్పితో ఇబ్బంది పడేవారు గ్లాసు చెరకు రసానికి అరచెక్క నిమ్మరసం, చిటికెడు నల్లఉప్పు కలిపి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. రొమ్ము కాన్సర్ బారినపడకుండా కాపాడే ఔషధగుణాలు కూడా ఈ రసంలో ఉన్నాయి.