చంద్రబాబు నాయుడు … రాజకీయాల్లో అపర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి సమయంలోనైనా కూడా తన వ్యూహాలతో తనకి పాజిటివ్ గా మార్చుకునేవారు. కానీ ,ఈ మధ్య అయన వ్యూహాల్లో పస తగ్గిపోయింది. దీనికి తోడు చంద్రబాబుకు ఇప్పుడు క్యాడర్ తో పాటు కుటుంబం కూడా సమస్యగా మారింది. చంద్రబాబు ముందు వచ్చే ఎన్నికల నాటికి అనేక ఛాలెంజ్ లు ఉన్నాయి. వీటిని అధిగమిస్తేనే 2024లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయం దక్కే అవకాశాలున్నాయి. అయితే చంద్రబాబు ముందు రెండు సవాళ్లున్నాయి.
అందులో రెండు సక్సెస్ అయితే చంద్రబాబుకు మరోసారి ముఖ్యమంత్రిగా ఛాన్స్ లభించినట్లేనని విశ్లేషకుల అంచనా. చంద్రబాబు కు ఇప్పుడు క్యాడర్ తో పాటు కుటుంబం కూడా సమస్యగా మారింది. చంద్రబాబు ముందు వచ్చే ఎన్నికల నాటికి అనేక ఛాలెంజ్ లు ఉన్నాయి. వీటిని అధిగమిస్తేనే 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీకి విజయం దక్కే అవకాశాలున్నాయి. అయితే చంద్రబాబు ముందు రెండు సవాళ్లున్నాయి. అందులో రెండు సక్సెస్ అయితే చంద్రబాబుకు మరోసారి ముఖ్యమంత్రిగా ఛాన్స్ లభించినట్లేనని విశ్లేషకుల అంచనా. బీజేపీ, జనసేనలు తనతో కలసి వస్తాయా, అన్న సందేహం చంద్రబాబుకు ఇప్పుడు కూడా ఉంది. కానీ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. జనసేన చంద్రబాబుతో కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, బీజేపీ మాత్రం ససేమిరా అంటోంది.
చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ రాష్ట్ర నేతలు ససేమిరా అంటున్నారు. చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ తో జత కట్టి ముందుకు వెళితే పార్టీ భవిష్యత్ బాగుంటుందని భావిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఆ రెండు పార్టీలు కలసి రావాలని కోరుకుంటున్నారు. ఇక చంద్రబాబుకు మరోసమస్య కుటుంబం. నందమూరి కుటుంబం చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది. బాలయ్య మద్దతు ఉన్నా ఎన్నికల వేళ పెద్దగా ప్రయోజనం ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ మద్దతు చంద్రబాబుకు అత్యవసరం. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎన్నికల నాటికి జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. నందమూరి కుటుంబం మొత్తాన్ని ప్రచారంలోకి దించేందుకు సిద్దమవుతున్నారు. మొత్తం మీద ఈ రెండు విషయాలలో సక్సెస్ అయితే చంద్రబాబుకు ఈసారి ప్రజలు ఛాన్స్ ఇచ్చే అవకాశముందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.