కొత్తలో సిల్క్ మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసిన సిల్క్ స్మిత కొన్నాళ్ళకు సైడ్ డ్యాన్సర్ గా అవకాశం అందుకుంది. ఆ తర్వాత మత్తెక్కించే లుక్స్ తో స్టార్ గా ఎదిగింది. ఒక టైం లో స్టార్ హీరోలు సైతం తన డేట్స్ కోసం వేచి చూసే స్థాయికి సిల్క్ స్మిత ఎదిగింది.
కొన్నాళ్ళకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి, తాను నిర్మించిన కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. అలాగే తాను అనుకున్న వాళ్ళు మోసం చేయడంతో చివరికి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. తనను ఓ వ్యక్తి మోసం చేశాడంటూ సిల్క్ చివరికి లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
అయితే ఒక హీరో….తన ఆత్మహత్య చేసుకునే ముందు తనకు కాల్ చేసింది, కానీ షూటింగ్ లో బిజీ గా ఉండడం వలన తాను కాల్ ఆన్సర్ చెయ్యలేదని చెప్పాడు. అతనే కన్నడ హీరో, డైరెక్టర్ రవిచంద్రన్. తాను, సిల్క్ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి మొదటిసారి ‘హల్లి మేస్త్రు’ అనే సినిమాలో నటించారు.
సిల్క్ స్మిత తన జీవితంలోని ప్రతి చిన్న విషయం తనతో పంచుకునేదని రవిచంద్రన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చనిపోయే ముందురోజు కూడా సిల్క్ తనకు ఫోన్ చేసిందని రవిచంద్రన్ తెలిపారు. కానీ తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయానని చెప్పారు. మామూలు కాల్ అనుకుని తాను తిరిగి ఫోన్ కూడా చేయలేదని అన్నారు. తాను ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే సిల్క్ స్మిత బ్రతికి ఉండేదేమో అని ఆవేదన వ్యక్తం చేశారు.
నా అనుకునే వాళ్ళు లేక, తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లి 1996 సెప్టెంబర్ 23 న, స్మిత తన చెన్నై లోని తన నివాసం లో చనిపోయింది.