సిల్క్ స్మితను గుర్తుచేసిన బొత్స.. కామెంట్స్ వైరల్!

ఏపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలూ ఏస్థాయిలో ఉంటాయో.. వెటకారాలు, వ్యంగ్యాస్త్రాలు.. ఒక్కమాటతో ప్రత్యర్థుల గాలి తీసేసే కామెంట్లూ అదే స్థాయిలో ఉంటాయి. ఫలితంగా ఏపీ రాజకీయాలు నిత్యం మీడియాలో రసవత్తరంగా మారుతుంటాయి. పైగా రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువగా ఉంటుందేమో.. ఈ వ్యాఖ్యలు జనాల్లోకి సులువుగా వెళ్లిపోతుంటాయి. ఈ క్రమంలో తాజాగా బొత్స సత్యన్నారాయణ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

గతంలో జనసమీకరణ విషయంలో సన్నీ లియోన్ కి – పవన్ కల్యాణ్ కి ఎక్కువగా వస్తుంటారని కంపేర్ చేశారు దర్శకుడు రాం గోపాల్ వర్మ. గతంలో సన్నీలియోన్ కొచ్చీకి వచ్చినప్పుడు వచ్చిన జనాలను చూపిస్తూ.. పవన్ పొలిటికల్ మీటింగులకు వచ్చే జనాలను కంపేరే చేశేవారు ఆర్జీవి. తనకు తెలిసి ఇండియాలో వీరిద్దరే భారీ క్రౌండ్ పుల్లర్స్ అని సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు.

ఆ సంగతి అలా ఉంటే… పవన్ సభలకు, కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వస్తున్న జనసందోహం పైన తనదైన పంచ్ లు వేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా స్పందించిన ఆయన… “ఒక కమెడియన్ వచ్చినా, యాక్టర్ వచ్చినా జనాలు వస్తారు. ఒక వ్యాంప్ క్యారెక్టర్ వేసే.. పాపం చనిపోయిన సిల్క్ స్మిత వచ్చినా చూడటానికి జనాలు వస్తారు” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఏపీకి ముఖ్యమంత్రిగా డాన్సులు వేసుకునే వ్యక్తి మనకు అవసరమా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బొత్స.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. “రక్తపు మరకలు అంటిన ముఖ్యమంత్రి మనకు కావాలా?” అని పవన్ ఎలా మాట్లాడతారు.. ఇది పద్దతి కాదంటూ సూచించారు. ఈ సందర్భంగా… నారా లోకేశ్ ఒక పొలిటికల్ లీడర్, పవన్ కల్యాణ్ ఒక సెలబ్రిటీ.. అంతేతప్ప వాళ్లేమీ మునులు కాదు” అని మండిపడ్డారు.

అనంతరం… రాష్ట్రంలో టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శించి, ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని బొత్స ఫైర్ అయ్యారు. అనంతరం… ఎవరు ఎన్ని డ్రామాలాడినా… అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు.. వారు అన్ని గమనిస్తుంటారు అని పేర్కొన్నారు.