ఏపీలో రాజధాని అంశం ఏడాది కాలంగా ఎంత హాట్ టాపిక్ గా నలుగుతుందో తెలిసిందే. ప్రస్తుతం కూడా ఇదే టాపిక్ పై రోజూ డిస్కషన్స్ . జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా అమరావతి, విశాఖపట్టణం, కర్నూల్ ని రాజధానులుగా ప్రకటించి ముందుకు వెళ్తున్నారు. దాదాపు మూడు రాజధానులు ఖారారపోయినట్లే ఈ బిల్లు రాజ్ భవన్ లో గవర్నర్ ముందు ఉంది. న్యాయ నిపుణుల సలహాల వ్యవహారం కూడా పూర్తయింది. ఇక గవర్నర్ సంతకం చేసి ప్రభుత్వం ముందుకు రావడమే ఆలస్యం. అయితే ఇలాంటి అంశమే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడులోని మరోసారి తెరపైకి వచ్చింది.
రాజధానిని చెన్నై నుంచి మరో నగరానికి తరలించాలని మూడు దశాబ్ధాల క్రితమే ప్రయత్నాలు జరిగాయి. తిరుచ్చి నగరాన్ని రాజధాని చేయాలని అప్పట్లో బాగా డిమాండ్లు వ్యక్తం అయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ప్రయత్నిస్తే, డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి చెన్నైలోని జనసాంద్రతను తగ్గించేందుకు సబర్బన్ ప్రాంతాలను కలుపుకుని శాటిలైట్ నగరాన్ని రూపొందించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు రావడంతో పనవ్వలేదు. కానీ కరోనా వేళ కూడా రాజకీయాలు ఎక్కడికక్కడ జోరుగానే సాగుతున్నాయి.
అప్పట్లో రాజధానిగా తిరుచ్చిని చేసి ఉంటే ఇప్పుడు చెన్నైలో ఉన్న 90 శాతం మంది వైరస్ బారిన పడి ఉండేవారు కాదని మేథావులు అంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పడుతున్నాయి. రాజధాని మార్చేస్తే కరోనా అక్కడికి రాదా? అయినా ఇలాంటి కరోనా జబ్బులు వస్తాయని ఎవరైనా ఊహిస్తారా? కావాలని రాజకీయం చేయడం కాకపోతే అంటూ మడిపడుతున్నారు. నిజమే రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ జన సాంధ్రత ఎక్కువగానే ఉంటుంది. అభివృద్ది చెందుతున్న నగరాల్లోనే ప్రజలు నివసించడానికి ఇష్టపడతారు. ఈ రోజు రాజధానికి తిరుచ్చి ఉండి ఉంటే అక్కడ 90 శాతం కరోనా కేసులు ఉండవని గ్యారెంటీ ఎవరైనా ఇవ్వగలరా? అని కామెంట్లు పడుతున్నాయి.