తెలుగు రాజకీయాలను శాసించిన టీడీపీ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తరువాత పతనం మొదలైంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పార్టీని నడిపించడానికి కూడా టీడీపీ నాయకులు లేరు. అయితే టీడీపీ నాయకులు మాత్రం రానున్న రోజుల్లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా టీడీపీనే గెలుస్తుందని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఎన్నికల కోసం ఎంతో ఎదురు చూస్తున్న టీడీపీ నాయకులకు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికను టీడీపీ నాయకులు చాలా సీరియస్ గా తీసుకున్నారు.
ఓడితే టీడీపీ పతనం ఖాయమేనా!!
ఇప్పటికే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం వల్ల అందరూ కూడా టీడీపీ యొక్క పతనం మొదలైందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికలో గెలుస్తామని టీడీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు చాలా ధీమాగా ఉన్నారు. కానీ తిరుపతిలో ఏ నియోజకవర్గంలో కూడా టీడీపీకి ప్రజా బలం లేదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం నిత్యం వీడియో కాన్ఫరెన్స్, నాయకుల సమావేశం నిర్వహిస్తూ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, అందుకే తిరుపతి టీడీపీ గెలుపు తధ్యమని బాబు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోయి, వైసీపీ గెలిస్తే రాష్ట్రంలో టీడీపీ పతనం ఖాయమైనట్టేనని, రానున్న రోజుల్లో కూడా టీడీపీ ఎవ్వరు కాపాడలేరని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
బాబు చేసిన తప్పులు
అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారు. ఇప్పుడు అధికారం పోయిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులే, మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. తాజాగా బాబు హిందువాదం ఎత్తుకోవడం వల్ల ఇప్పటికే చాలా వర్గాల ప్రజల యొక్క ఓట్లను ఇప్పటికే కోల్పోయారు. ఇలా బాబు చేసిన తప్పులు ఇప్పుడు బాబుకు తలనొప్పిగా మారాయి.