జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది.అయితే కొన్ని కీలక స్థానాల్లో మాత్రం ఓట్లను చీల్చి టీడీపీని ఘోరంగా దెబ్బతీసింది. ఆ దెబ్బనుంది టీడీపీ ఇంకా కొలుకోలేదు. చాలా మంచి సిద్ధాంతాలతో హీరో పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారు. ఆ సిద్ధాంతాలకు లోబడి ఎన్నికల్లో వైసీపీ నాయకులు పోటీకి దిగారు. పార్టీకి ఉన్న సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యాడు.
విఫలమవ్వడానికి కారణాలేంటి?
జనసేనలో ప్రజలకు బాగా తెలిసిన నాయకులు ఎవరైన ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన మాత్రమే పార్టీలో ఆక్టివ్ గా ఉంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయం జనసేనకు తీవ్ర నష్టం తెస్తుంది. ఎందుకంటే టీడీపీలో, వైసీపీలో కీలక నేతలు చాలామంది ఉన్నారు, పార్టీ అధినేతలతో పాటు వాళ్ళు కూడా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్నంత మాస్ లీడర్స్ జనసేనతో లేకపోవడం వల్లే పార్టీకి కష్టాలు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కనీసం 2024లో వచ్చే ఎన్నికల సమయం వరకైనా పార్టీలో మాస్ ఇమేజ్ ఉన్న నాయకులు లేకపోతే పార్టీ మళ్ళీ ఇబ్బందుల్లో పడటం ఖాయమనిపిస్తుంది. రాజకీయంగా దేనికైనా తెగించే నాయకులు.. ఏవిషయంపైనైనా అనర్గళంగా వ్యాఖ్యానించే నేతలు వైసీపీ, టీడీపీలకు చాలా మంది ఉన్నారు. అదేసమయంలో సామాజిక వర్గాల వారీగా కూడా నాయకులు ఉన్నారు. ఇదే తరహా రాజకీయం బీజేపీలోనూ ఉంది. అయితే, ఎటొచ్చీ.. ఇప్పుడు జనసేనలో మాస్ లీడర్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఆలోచించాల్సిన సమయం దగ్గర పడిందని పార్టీ కూడా తెలుపుతున్నాయి.
జనసేన సిద్ధాంతాలను మెచ్చుకుంటున్న వైసీపీ నాయకులు
సిద్ధాంతాలకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు వైసీపీ నేతల నుండి కూడా ప్రసంశలు దక్కుతున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ…సిద్ధాంతాలకు కట్టుబడి జనసేన సాధించిన ఓట్లను, ప్రజల ఆదరణను సాధించడానికి వైసీపీకి కొన్ని సంవత్సరాలు పడుతుందని వ్యాఖ్యానించారు. పార్టీ సిద్ధాంతాలను రానున్న రోజుల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి జనసేన నాయకులు ఇప్పటికే అనేక ప్రణాళికలు రచించారని సమాచారం