తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పదవి కోసం పోరాటం చేసే వ్యక్తి కాదని.. ఎన్సీపీ అధినేత శరత్ పవార్ వల్లే తాను ముఖ్యమంత్రి పదవి స్వీకరించానని అన్నారు. హిందుత్వ అనేది తమ పార్టీ సిద్ధాంతమని.. దానిని పార్టీ గాని, తాము గాని వదిలి పెట్టలేదు అని అన్నారు.
ఇక తన సీఎం పదవికి తాను సరిపోనని పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తే తన పదవి నుంచి దిగిపోయేందుకు తాను సిద్ధమే అని అన్నారు. ఇక ఈ విషయాన్ని ఒక్క ఎమ్మెల్యే చెప్పిన కూడా.. మరుక్షణమే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అంతేకాకుండా సీఎం పదవికి రాజీనామా లేఖను కూడా తన వద్దే సిద్ధంగా ఉంచుకున్నానని అన్నారు.