నారాయణ నోరు విప్పితే చంద్రబాబు కొంప కొల్లేరేనా.?

Narayana Open Lips : మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ ఎందుకు మౌనం దాల్చారు.? అన్న ప్రశ్న ఇప్పటిది కాదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక, ఆయన పెద్దగా రాజకీయ తెరపై కనిపించలేదు. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కీలకమైన మంత్రిగా వున్నారు గనుక, ఆ తర్వాత పార్టీకి ఆయన సేవలందిస్తారని ఆశించిన టీడీపీ శ్రేణులకు నిరాశే మిగిలింది.

ఆర్థికంగా అంతకు ముందు టీడీపీకి వెన్నుదన్నుగా వున్నారు గనుక, మంత్రి పదవి సొంతం చేసుకున్నారు, తనక్కావాల్సిన పనులు చేసుకున్నారు, లాభ నష్టాల బేరీజు వేసుకుని, నారాయణ రాజకీయాలకు దూరమయ్యారు. ఇదైతే వాస్తవం. అబ్బే, తాను సుద్దపూసననీ, రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడం కోసమేనని నారాయణ చెబితే నవ్వే వాళ్ళెవరున్నారు.?

అమరావతి కుంభకోణం అలాగే ఇటీవల వెలుగు చూసిన టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ కుంభకోణాల్లో మాజీ మంత్రి నారాయణ పాత్రను ఏపీ పోలీసులు గుర్తించారు. కేసులు నమోదయ్యాయి, నారాయణ ఓ కేసులో అరెస్టయ్యారు కూడా. అయితే, నారాయణ విద్యా సంస్థలతో తనకు సంబంధం లేదంటూ చాలా తెలివిగా వ్యవహరించి నారాయణ బెయిల్ పొందారు.

ఆ బెయిల్ పుణ్యం కూడా చంద్రబాబేనని వైసీపీ విమర్శిస్తోందనుకోండి. అది వేరే సంగతి. ఇంతకీ, నారాయణ ఎక్కడ.? ఆయన ఏం చేస్తున్నారు.? ఎందుకు పెదవి విప్పడంలేదు.? ఇదైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే. నారాయణ పెదవి విప్పితే చంద్రబాబు బండారమే బయటపడుతుందని బహుశా నారాయణ నోరుని టీడీపీనే నొక్కేసిందని అనుకోవాలేమో.!

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ ఎందుకు మౌనం దాల్చారు.? అన్న ప్రశ్న ఇప్పటిది కాదు.

2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక, ఆయన పెద్దగా రాజకీయ తెరపై కనిపించలేదు. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కీలకమైన మంత్రిగా వున్నారు గనుక, ఆ తర్వాత పార్టీకి ఆయన సేవలందిస్తారని ఆశించిన టీడీపీ శ్రేణులకు నిరాశే మిగిలింది.