Ambanti: జనసేన ఆవిర్భావ దినోత్సవం… తమ్ముడి పార్టీకి శుభాకాంక్షలు…. అంబంటి ట్వీట్ వైరల్!

Ambanti: జనసేన పార్టీ స్థాపించి నేటికి సరిగా 12 సంవత్సరాలు కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు ఈ పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడం డిప్యూటీ సీఎం అయిన నేపథ్యంలో తన పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు.

ఇప్పటికే పిఠాపురంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా నిర్వహించారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడకు చేరుకొని తన పార్టీని ఉద్దేశించి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇలా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే మాజీ వైసీపీ మంత్రి అంబంటి రాంబాబు సంచలనమైన ట్వీట్ చేసారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు స్పందిస్తూ బాబు కోసం పుట్టిన తమ్ముడు పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా ట్యాగ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ 12 సంవత్సరాల తర్వాత పార్టీని స్థాపించిన ఇప్పటివరకు ఒకసారిగా ఎమ్మెల్యే కాలేదు కానీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని ఈయన గెలిచారని అలాగే చంద్రబాబును సీఎం చేయడం కోసమే ఈయన తన పార్టీని స్థాపించారన్న ఉద్దేశంతో అంబటి రాంబాబు చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.