విష్ణు గెలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలడా?

ఎక్కడా లేని విధంగా తెలుగు ఆడియెన్స్ అన్ని వర్గాల సినిమాలను కూడా ఎంతో ఆదరిస్తారు. కంటెంట్ బాగుంటే చాలా ఇతర భాషలు సినిమాలు మన దగ్గర హిట్టయినవి కోకొల్లలు.. అయితే రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయా అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న “మా” ఎన్నికలు బట్టి డిసైడ్ అయ్యేలా ఉంది. ఇప్పుడు మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ ల ప్యానల్ నడుమ ద్విముఖ పోటీ కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఎవరిమట్టుకు వారు గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ విష్ణు తీరునే కాస్త అభ్యంతరకరంగా ఉందనిపిస్తుంది.

“లోకల్ నాన్ లోకల్” అనే కాన్సెప్ట్ ని ఈ ఎన్నికల్లో రైజ్ చెయ్యడం ఎటు దారి తీస్తుందో తెలియని విధంగా మారింది. ఈ నాన్ లోకల్ అనేది ఒకపక్క ఒక్క ఎన్నికలకు మాత్రం కాకుండా సినిమాలకు కూడా వర్తిస్తుందా అనే ప్రశ్న విష్ణుపై వస్తుంది. సరే విష్ణు కనుక గెలిస్తే తన అభిప్రాయం ప్రకారం ఇతర భాషల సినిమాలు టాలీవుడ్ లో రిలీస్ చెయ్యకూడదు కదా??

ఎందుకంటే మన లోకల్ లోనే ఉండాలి. అలాగే ఇంకో ప్రశ్న మరి ఇతర భాషల సినిమాలు మన దగ్గర ఆపేస్తే ఇక వాళ్ళు మాత్రం మన సినిమాలను అయితే ఎందుకు చూస్తారు? వాళ్ళకి మనవి నాన్ లోకల్ సినిమా కదా? అని ప్రకాష్ రాజ్ మద్దతుదారుల సూటి ప్రశ్న.

నటునికి ఎల్లలు అనేవి ఉండవు ఎన్ని భాషల సినిమాలు మనం చూసి ఉంటాం.. ఇంకా ప్రకాష్ రాజ్ కెరీర్ లో అయితే తెలుగు సినిమా ఎంతో పెద్ద పాత్ర పోషించింది. అలా ప్రకాష్ రాజ్ కి మన తెలుగు ఆడియెన్స్ కూడా ఈ కోణంతో సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు సమాధానమే చెప్పే భాద్యత అయితే విష్ణు పై ఎట్టి పరిస్థితుల్లోని ఉంది.