బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి టీడీపీ ప్రయత్నిస్తుంటే, వైసీపీ నాయకులు మాత్రం అధికారంతో టీడీపీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. అలాగే తెలంగాణలో ఇప్పటి వరకు తనకు ఎదురే లేదని అనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు బీజేపీ నుండి పెద్ద చిక్కువచ్చి పడింది. ఒక్కసారిగా బీజేపీ కేసీఆర్ కు చుక్కలు చూపిస్తుంది. అయితే బీజేపీ రచించిన ఒక రాజకీయ పథకం కేసీఆర్, చంద్రబాబు నాయుడులను రాజకీయంగా దెబ్బతియ్యనుంది.
చంద్రబాబు ఇంక ఇంటికే
జమిలి ఎన్నికలు వస్తాయని దేశంలో ఎప్పటి నుండి ప్రచారం జరుగుతుంది. ఒక్కసారి మోడీ చేసిన వ్యాఖ్యల వల్ల జమిలి ఎన్నికల ప్రచార ఊపు దేశంలో మొదలైంది. అలాగే ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా జమిలి ఎన్నికల జపం చేస్తున్నారు. అయితే జమిలి ఎన్నికలు వస్తే మాత్రం ఏపీలో చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా దెబ్బపడటం ఖాయమని రాజకీయ విశ్లేషకుల చెప్తున్నారు. ఒకవేళ 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని అందరూ భావిస్తున్నారు. అయితే అప్పుడు వచ్చినా కూడా ఏపీలో జగన్ కే అనుకూలమని, ఎందుకంటే ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత రాలేదని, ఇంకొక సంవత్సరం పాటు ఇదే పాలన కొనసాగిస్తే జగన్ అధికారంలోకి వస్తారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జగన్ పై వ్యతిరేకత తీసుకొని రావడానికి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కానీ ప్రజలకు అవి చేరడం లేదు.
కేసీఆర్ కూడా ఇంటికే
తెలంగాణలో ఇప్పటి వరకు తనకు ఎదురే లేదని సీఎం కేసీఆర్ అనుకున్నారు కానీ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారింది. ఇప్పుడు బీజేపీ కేసీఆర్ కు చుక్కలు చూపిస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకతను బీజేపీ నాయకులు వాడుకుంటూ రాజకీయంగా బలపడుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో కూడా రాజకీయంగా బలపడటానికి బీజేపీ పతకాలు రచిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో 2022లో జమిలి ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని, కేసీఆర్ రాజకీయంగా ఇంటికి వెళ్లడం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.