కరోనా.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం పోరాడుతోంది ఈ వైరస్ తో. ప్రపంచ చరిత్రలోనే ఇఫ్పటి వరకు ఏ వైరస్ కూడా ప్రపంచం మొత్తాన్ని ఒకేసారి అటాక్ చేయలేదు. తద్వారా ప్రపంచం మొత్తం స్తంభించిపోలేదు. కానీ.. మొదటిసారి కరోనా వల్ల ప్రపంచం మొత్తం ఒకేసారి స్తంభించిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుదేలు అయింది. ఉన్న ఉద్యోగాలు ఊడాయి. నిరుద్యోగం పెరిగింది. చేతుల్లో పనులు లేవు. జేబుల్లో చిల్లిగవ్వ లేదు. పరిస్థితి అంత దారుణంగా తయారైందంటే దానికి కారణం కరోనా వైరస్.
అయితే.. కరోనా వైరస్ పై ఎప్పటికప్పుడు ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ దానికి తగ్గట్టుగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూనే ఉన్నది.
తాజాగా.. మరో సర్వే నిర్వహించిన ఐసీఎంఆర్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ విషయాలను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు తెలిపింది.
కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిన వివరాల ప్రకారం… ఐసీఎంఆర్ సర్వే ప్రకారం.. గత నెల అంటే ఆగస్టు నాటికే 10 ఏళ్లు పైబడిన వాళ్లలో 15 మందిలో ఒకరికి కరోనా వచ్చిందట. అలా.. దేశం మొత్తం మీద దాదాపు 20 కోట్ల మందికి కరోనా వచ్చిందట.
అయితే.. కరోనా వచ్చిపోయిన సంగతి కూడా వాళ్లకు తెలియదట. అంటే ఎటువంటి లక్షణాలు లేకుండా 15 మందిలో ఒకరికి కరోనా వచ్చి వెళ్లిపోయిందన్నమాట. వాళ్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండటం వల్ల కరోనా దానంతట అదే తగ్గిపోయింది.. అని ఐసీఎంఆర్ సర్వేలో వెల్లడయినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా పట్టణాల్లోనే ఎక్కువగా కరోనా వ్యాప్తి ఉందని.. పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో 15.6 శాతం కరోనా వ్యాప్తి జరగగా.. గ్రామీణ ప్రాంతాల్లో 4.4 శాతం మాత్రమే కరోనా వ్యాపించినట్టు సర్వేలో వెల్లడయింది.