ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్డీలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసుకున్న వాళ్లకు వడ్డీపై భారీ ప్రభావం పడనుంది.
ప్రస్తుతం ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసుకోవాలన్నా.. కాస్త ఆలోచించాల్సిందే. సాధారణంగా ఐసీఐసీఐ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలాని ఫిక్స్ డ్ డిపాజిట్లను అందిస్తోంది. నెలలోపు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ 2.5 శాతం మాత్రమే. అలాగే నెల నుంచి మూడు నెలల మధ్య కాలంలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీ 3 శాతం మాత్రమే.
కొత్తగా వచ్చిన వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచే అమలులలోకి వచ్చాయి. 5 ఏళ్లకు పైబడి ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినా బ్యాంకు నుంచి లభించే వడ్డీ కేవలం 5.5 శాతమే. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఎఫ్డీల్లో పెట్టుబడులు పెట్టడానికి కాస్త ఆచీతూచీ అడుగేస్తున్నారు.