చిరుద్యోగులకు శుభవార్త.. ఐసీఐసీఐ బ్యాంకు బంపర్ ఆఫర్.. అప్నా ఘర్ డ్రీమ్ స్కీమ్ తో సొంతింటి కలను నెరవేర్చుకోండి

apna ghar dream scheme by icici bank for small scale industries employees

మీరు ఉద్యోగం చేసినా చేయకపోయినా.. మీరు చిరుద్యోగులైనా.. కార్పెంటర్ అయినా.. వ్యాపారవేత్త అయినా.. మీ సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటే ఇదే మీకు సువర్ణావకాశం. మీలాంటి వాళ్ల కోసమే ఐసీఐసీఐ బ్యాంకు హౌసింగ్ ఫైనాన్స్ సరికొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. దానిపేరే అప్నా ఘర్ డ్రీమ్ స్కీమ్.

apna ghar dream scheme by icici bank for small scale industries employees
apna ghar dream scheme by icici bank for small scale industries employees

ఈ స్కీమ్ ను రెండు రకాలుగా విభజించారు. ఒకటి ఉద్యోగస్తులకు, మరొకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కోసం. లోన్ కోసం అప్లయి చేసిన 72 గంటల్లోనే లోన్ అమౌంట్ అకౌంట్ లో పడిపోయేలా ఈ ప్లాన్ ను రూపొందించారు. ఈ స్కీమ్ ద్వారా లోన్ పొందాలనుకునేవాళ్లు ఏదైనా ఐసీఐసీఐ హెచ్ఎఫ్సీ బ్రాంచ్ కు వెళ్లి వివరాలను కనుక్కోవచ్చు. ఆధార్, పాన్ కార్డు తీసుకెళ్లి.. అప్లికేషన్ నింపితే చాలు.. వెంటనే బ్యాంకు సిబ్బంది లోన్, ఈఎంఐ లాంటి వివరాలను వెంటనే చెప్పేస్తారు.

ముఖ్యంగా చిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ల కోసమే ఈ స్కీమ్ ను ఐసీఐసీఐ బ్యాంకు తీసుకొచ్చింది. వాళ్ల సొంతింటి కలను నెరవేర్చడం కోసం ఐసీఐసీఐ ఈ స్కీమ్ లో ఎన్నో వెసులుబాట్లను కల్పించింది.

కనీసం 2 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ ద్వారా రుణం పొందే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ లో అకౌంట్ ఉండి.. కనీసం 15 వందల రూపాయలు అకౌంట్ లో మెయిన్ టెన్ చేస్తే చాలు.. ఈ స్కీమ్ ద్వారా లోన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకునేవాళ్లు.. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 2,65,000 వరకు సబ్సిడీ పొందొచ్చు.

ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే సమీపంలోని ఐసీఐసీఐ హెచ్ఎఫ్సీ బ్రాంచ్ కు వెళ్లి మీ వివరాలు ఇచ్చి లోన్ కు వెంటనే అప్లయి చేసుకోండి. మీ సొంతింటి కలను నెరవేర్చుకోండి.