మీరు ఉద్యోగులా? ప్రైవేటు ఉద్యోగులు అయినా సరే.. ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే.. మీకు శాలరీ అకౌంట్ ఉంటే చాలు.. మీకు బంపర్ ఆఫర్. ఈ కరోనా కాలంలో మీకు కాస్తోకూస్తో ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందిస్తున్నాయి బ్యాంకులు. శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు కొన్ని బ్యాంకులు ఓడీ ఫెసిలిటీని అందిస్తున్నాయి. ఓడీ అంటే ఓవర్ డ్రాఫ్ట్ అన్నమాట. అంటే మీ జీతం ఎంతో దానికి రెట్టింపు డబ్బును ముందే పొందొచ్చు. ఆ తర్వాత దాన్ని వాడుకున్న ప్రకారం వడ్డీ చెల్లించవచ్చు. లేదంటూ ఈఎంఐ రూపంలో అయినా తిరిగి పే చేయవచ్చు.
దాదాపు అన్ని బ్యాంకులు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ.. ఐసీఐసీఐ బ్యాంకు ఇంకాస్త ముందుకెళ్లి.. ఒక నెల జీతానికి మూడు రెట్లు ఎక్కువ డబ్బును అందిస్తోంది. అది కూడా ఓడీ రూపంలోనే తన కస్టమర్లకు ఈ ఆఫర్ ను అందిస్తోంది.
ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందాలంటే.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవడం కానీ.. ఐమొబైల్ యాప్ లో లాగిన్ అయి కానీ చెక్ చేసుకోవచ్చు. లాగిన్ అయ్యాక.. ఆఫర్స్ విభాగంలో ప్రీ అప్రూవుడ్ ఓడీ అనే ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి డిటెయిల్స్ ఇస్తే వెంటనే ఓవర్ డ్రాఫ్ట్ కింద డబ్బులను అకౌంట్ లో జమ చేస్తారు.
అయితే.. ఈ సౌకర్యాన్ని బ్యాంకు అందరు కస్టమర్లకు ఇవ్వలేదు. లాయల్ కస్టమర్లకు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఐసీఐసీఐ బ్యాంకు అందించింద.
ఒకవేళ మీది వేరే బ్యాంక్ అయినా సరే.. సేమ్ ఇదే ప్రొసీజన్. ఆ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు లాగిన్ అయి… ఆఫర్స్ సెక్షన్ లో ఓడీని చెక్ చేయండి. అయితే.. ఓడీ సౌకర్యం పొందితే.. దానికి ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీని బ్యాంక్ కస్టమర్లను నుంచి వసూలు చేస్తుంది.