సాధారణంగా బ్యాంకులు ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నాయి. బ్యాంక్ లో అకౌంట్ కలిగిన వారు సేవింగ్స్ అకౌంట్ లో మినిమం బాలన్స్ తప్పనిసరిగా తప్పనిసరిగా ఉంచుకోవాలి. అకౌంట్లో మినిమం బాలన్స్ లేనియెడల అదనపు రుసుము బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏ బ్యాంకు అకౌంట్లో ఎంత మినిమం బ్యాలెన్స్ ఉండాలో పూర్తి వివరాల గురించి మనం తెలుసుకున్నాం.
• స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లో అకౌంట్ కలిగిన వినియోగదారులు మినిమం బాలన్స్ మెయిన్టైన్ చేయాల్సిన అవసరం లేదు.
• యూకో బ్యాంక్ కస్టమర్లు వారి అకౌంట్లో యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ రూ. 250 నుంచి రూ. 1000 వరకు ఉండాలి.
• పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు వారి అకౌంట్ లో రూ. 500 నుంచి రూ. 2 వేల వరకు క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి.
• యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులు వారి అకౌంట్ లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 2500 నుంచి రూ. 12 వేల వరకు ఉంచుకోవాలి.
• హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ రూ. 2500 నుంచి రూ. 10 వేల వరకు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.
• ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు ఉండాలి. *
• అలాగే ఐడీబీఐ బ్యాంక్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 500 నుంచి రూ. 5 వేల వరకు ఉండాలి.
• పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు రూ. 500 నుంచి రూ. 2 వేల వరకు యావరేజ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి.
• బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా రూ. 500 నుంచి రూ.2 వేలు వరకు మినిమమ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ ఉండాలి.
• హెచ్ఎస్‌బీసీ అకౌంట్ వినియోగదారులు యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్ రూ.1000 నుండి రూ. 1.5 లక్షలు ఉండాలి.
• కెనరా బ్యాంక్ కస్టమర్లు మినిమం యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ. 500 నుంచి రూ.1000గా ఉండాలి.