ఏపీలో కరోనా క్రమంగా తగ్గుతోంది. మునుపటితో పోల్చితే ప్రజల జీవన విధానంలో వేగం పెరిగింది. ప్రజలు కూడా దైర్యం చేసి రోడ్ల మీదికి వస్తున్నారు. మునుపటిలా తమ తమ పనుల్ల బిజీగా ఉంటున్నారు. స్కూళ్లు కూడా తెరుచుకున్నాయి. కాని సచివాలయానికి వచ్చేందుకు ఉన్నతాధికారులు జంకుతున్నారు. దీంతో
ఏపీలో సచివాలయం బోసిపోయింది. ఏపీ సచివాలయంలో ఇంకా సాధారణ పరిస్థితులు రాలేదు. మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులు సచివాలయానికి మనుపటిలా రెగ్యులర్ గా రావడం లేదు.
గతంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీలు, మంత్రుల రివ్యూలు… ఐఏఎస్ అధికారుల సమీక్షలతో నిత్యం సందడిగా ఉండేది సచివాలయం. అయితే కరోనా కారణంగా మిగతా అన్ని చోట్ల మాదిరిగానే సచివాలయం కూడా బోసిపోయింది. ఇప్పుడు కేంద్రం అన్‌లాక్-5 ప్రకటించింది. పలు ఆంక్షలు, ముందు జాగ్రత్తల నడుమ ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు భయం భయంతో పనిచేస్తున్నాయి. కాని సచివాలయానికి రావాల్సిన ఐఏఎస్ అధికారులు మాత్రం మునుపటిలా జోరు చూపించడం లేదు. కరోనా కారణంగా లేనిపోని ఇబ్బందులు ఎందుకు తెచ్చుకోవడం ఎందుకని చాలా మంది వర్క్ ఫ్రం హోం కే ప్రయారిటీ ఇస్తున్నారు. అందరిలాగే తాము కూడా మనుషులమేనని, తమ వద్దకు వచ్చే వాళ్లకు చెప్తున్నారట.
అయితే తప్పదు కాబట్టి ప్రతి నిత్యం ప్రజల మధ్య ఉండే మంత్రులు కూడా సచివాలాయనికి రాకపోవడం చర్చనీయాంశమైంది. రిస్క్ తీసుకొని అంతా కలియతిరుగుతున్న మంత్రులు సచివాలయానికి ఎందుకు రావడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. మంత్రులు సెక్రటేరియెట్‌కు వస్తే అధికారులు తప్పక రావాలి వస్తుంది. అయితే అమాత్యులే రాకపోవడంతో ఉన్నతాధికారులు కూడా వర్క్ ఫ్రం హోం తో సరిపెడుతున్నారు. పాలనా పరమైన సమావేశాల కోసం మంత్రులకు సచివాలయం బదులు హెచ్.ఓ.డి కార్యాలయాలను సూచిస్తున్నారంట ఉన్నతాధికారులు. అక్కడ అయితే రద్దీ తక్కువగా ఉంటుందని చెబుతున్నారట. దీంతో సమావేశాలన్నీ హెచ్.ఓ.డి కార్యాలయాలోన్నే జరుగుతున్నాయి. దీంతో సచివాలయానికి రాకపోకలు తగ్గిపాయయంట. మొత్తానికి ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూ… పాలనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పని కానిచ్చేస్తున్నారంట ఏపీలో ఉన్నతాధికారులు.