ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలి గుర్తున్నారా? ఆమె తెలుగు అమ్మాయే. అచ్చ తెలుగు పదహారణాల అమ్మాయిలా కనిపించే అమ్రపాలి కొంత కాలం తెలుగు రాష్ట్రాల్లో కలెక్టర్ గా విధులు కూడా నిర్వహించారు. వరంగల్ లో కలెక్టర్ గా ఉన్నప్పుడు అమ్రపాలికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అంత క్రేజ్ అమ్రపాలికి తెలుగు రాష్ట్రాలో.
అయితే.. అమ్రపాలికి ప్రమోషన్ ఇచ్చేశారు. అవును… ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో పనిచేసిన అమ్రపాలికి ప్రమోషన్ ఇచ్చి.. ప్రధాని ఆఫీసుకు అటాచ్ చేశారు. ప్రధాని ఆఫీసుకు ప్రమోషన్ రావడమంటే మాటలు కాదు. ఎందరో ఐఏఎస్ లు ఉన్నా.. కొందరికే ఆ అవకాశం దక్కుతుంది.
ఆ అవకాశం దక్కించుకున్న అతి కొద్దిమందిలో అమ్రపాలి ఒకరు. ఆమెను ప్రధాని ఆఫీసులో డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. ఆమె అతి చిన్న వయసులోనే ఈ పోస్టులో నియమితులయ్యారు. ఈ పోస్టులో ఆమె మరో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
అమ్రపాలి యూనియన్ కేబినేట్ సెక్రటేరియట్ లో డిప్యూటీ సెక్రటరీగా పని చేయడంతో పాటు.. ప్రస్తుతం ఆమె కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.
అమ్రపాలిది వైజాగే. 2010 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మను ఆమె పెళ్లి చేసుకున్నారు.
తన పెళ్లికి ముందు అమ్రపాలి తెలంగాణలో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా విధు నిర్వర్తించారు. వరంగల్ జిల్లాకు కలెక్టర్ గా ఉన్నారు.