తను రెండేళ్ళ పాటు వరంగల్ లో పనిచేసిన అనుభూతులను గుర్తు చేసుకున్నారు. అధికారుతో ఉన్న బంధాన్ని నెమరేసుకున్నారు. ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా కూడా ముఖముపై నవ్వును మాత్రం చెరగనివ్వలేదు. ఉద్యోగులతో ఉన్న సాన్నిహిత్యాన్ని నెమరేసుకున్నారు ఆవిడే కలెక్టర్ ఆమ్రపాలి. కుడాలో తన వీడ్కోలు సమావేశంలో ఆమ్రపాలి మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.
వరంగల్ అర్బన్ కలెక్టర్ నుంచి జీహెచ్ ఎంసీకి ఆమ్రపాలి బదిలీ అయిన విషయం తెలిసిందే. వరంగల్ లోని అన్ని శాఖల ఉద్యోగులు ఆమ్రపాలికి వీడ్కోలు సమావేశాలు ఏర్పుటు చేశారు. కుడా కార్యాలయంలో ఆమ్రపాలికి వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సమావేశంలో కుడా చైర్మన్ కన్నీరు పెట్టుకున్నారు. ఆమ్రపాలి కూడా తన చివరి ప్రసంగంలో మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ గా ఫీల్ అయినా అది బయటికి అవుపించకుండా కవర్ చేశారు. తనను ఉద్యోగులు ఎప్పుడైనా సంప్రదించవచ్చని తన ఫోన్ నంబర్ లో కూడా ఎటువంటి మార్పు ఉండదని ఉద్యోగులతో అన్నారు. ఆమ్రపాలి మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.