అలాంటి కోడలు రావాలనుకున్నాను… కానీ అంటూ ఎమోషనల్ అయిన అమర్ దీప్ తల్లి..!

బుల్లితెర నటుడు అమర్ దీప్ గత రెండు రోజుల క్రితం బుల్లితెర నటి తేజస్వినితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ రహస్యంగానే మరొక సీరియల్ నటి తేజస్వినితో ప్రేమ ప్రయాణం కొనసాగించారు. తేజస్విని కన్నడ నటి అయినప్పటికీ ఈమె కోయిలమ్మ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే ప్రస్తుతం ఈమె కేరాఫ్ అనసూయ సీరియల్ లో కూడా నటిస్తున్నారు.

ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వీరిద్దరూ గత కొద్దికాలం నుంచి ప్రేమలో ఉన్నారని అయితే వీరి ప్రేమ విషయం ఎక్కడ బయటికి చెప్పకుండా ఒక్కసారిగా నిశ్చితార్థం జరుపుకోవడంతో బుల్లితెర నటీనటులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇకపోతే వీరు నిశ్చితార్థానికి జానకి కలగనలేదు సీరియల్ నుంచి మల్లికా పాత్రలో నటిస్తున్నటువంటి విష్ణు ప్రియ అలాగే జానకి పాత్రలో నటిస్తున్న ప్రియాంక జైన్, నిఖిల్ వంటి తదితరులు నిశ్చితార్థానికి హాజరయ్యారు.ఇక అమర్ విష్ణు ప్రియను అక్క అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తారని తాను దగ్గరుండి అమర్ నిశ్చితార్థ కార్యక్రమాలను జరిపించారు.

ఈ క్రమంలోనే విష్ణు ప్రియ ఈ నిశ్చితార్థ వేడుకను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా విష్ణు ప్రియ ప్రియాంక తన గదిలో రెడీ అవుతుండగా అక్కడకు అమర్ దీప్ తల్లి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమెను పరిచయం చేయడమే కాకుండా తేజస్విని కోడలుగా రావడం మీకు ఎలా అనిపించింది అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనకు కాబోయే కోడలు గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.తాను తన కుటుంబానికి ఎంతో అందమైన సాంప్రదాయబద్ధమైన కోడలు రావాలనుకున్నాను అలాగే నా కోడలు ఎంతో అందంగా ఉండటమే కాకుండా మంచి సింగర్ క్లాసికల్ డాన్సర్ కూడా. ఇలా క్లాసికల్ ఫ్యామిలీకి క్లాసికల్ డాన్సర్ కోడలుగా రావడం ఎంతో సంతోషంగా ఉంది. నేను మొదటినుంచి ఎలాంటి కోడలు రావాలనుకున్నానో ఆ అమ్మాయి అలాగే ఉంది అంటూ తనకు కాబోయే కోడలు గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.