Amardeep: విడాకులకు సిద్ధమైన అమర్ దీప్… తేజస్విని… షాకింగ్ న్యూస్ చెప్పిన తేజు?

Amardeep: సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కలిసున్న వారి కంటే కూడా విడిపోతున్న వారి సంఖ్య అధికమవుతుంది. రోజురోజుకు ఎంతో మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం వెండితెర సెలబ్రిటీలు మాత్రమే కాదు బుల్లితెర సెలబ్రిటీలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు విడాకులు తీసుకొని విడిపోతున్నారు.

ఈ క్రమంలోనే మరో బుల్లితెర జంట విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు పెద్ద ఎత్తున చెక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెరపై ఎంతో మంచి ప్రజాదరణ సొంతం చేసుకున్న వారిలో అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ జంట ఒకటి. వీరిద్దరు బుల్లితెర నటి నటులుగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక తేజస్విని కన్నడ తమిళ తెలుగు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక సీరియల్స్ తో పాటు పలు బుల్లితెర కార్యక్రమాలలోనూ అదే విధంగా సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.

ఇక వీరి వివాహం జరిగి దాదాపు మూడు సంవత్సరాలవుతుంది అయితే వీరిద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోతున్నారనే వార్తలు వినిపించాయి అయితే తాజాగా ఈ వార్తలపై తేజస్విని స్పందించారు జబర్దస్త్ వర్ష టాక్ షో కిసిక్ టాక్ కార్యక్రమానికి తేజస్విని హాజరయ్యారు. ఇందులో భాగంగా విడాకుల గురించి ఆమె స్పందించారు.

భార్య భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు అపార్థాలు ఉండటం సర్వసాధారణం అలాంటి గొడవలు మా మధ్యన ఉన్నాయి అంతమాత్రాన విడాకులు తీసుకుని ఎవరు విడిపోరు అంటూ తెలిపారు. ప్రస్తుతం మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము అమర్ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా నేను తనని ప్రేమిస్తున్నాను మావిడాకులు గురించి వచ్చే వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలిపారు. ప్రస్తుతం మా వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుందని త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నాము అంటూ ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు .