ఆ సినిమాను రోజుకు మూడుసార్లు చూసేదాన్ని.. అదో అద్భుతమైన జ్ఞాపకం: కృతి శెట్టి

కృతి శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఉప్పెన సినిమా ద్వారా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా తర్వాత నాని సరసన శ్యామ్ సింగరాయ్ అనే సినిమాతో హిట్టు కొట్టారు అలాగే అక్కినేని హీరో నాగచైతన్య సరసన బంగార్రాజు చిత్రం ద్వారా మరో హిట్టు తన ఖాతాలో వేసుకున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఈమె తమిళ డైరెక్టర్ లింగస్వామి దర్శకత్వంలో రామ్ సరసన దివారియర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 14వ తేదీ ప్రసారం కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కృతి శెట్టి ది వారియర్ సినిమా గురించి, అలాగే డైరెక్టర్ లింగస్వామి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

లింగస్వామి గారి దర్శకత్వంలో వచ్చిన ఆవారా సినిమా అంటే తనకెంతో ఇష్టమని, ఈ సినిమా తన జీవితంలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయిందని తెలిపారు. ఈ సినిమా విడుదల సమయంలో అమ్మమ్మ గారి ఇంటికి వచ్చినప్పుడు నేను ఈ సినిమా సీడీని వేసుకొని రోజుకు రెండు మూడు సార్లు చూసేదానిని ఈమె వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయని, కథపరంగా సినిమాలు చాలా బాగుంటాయని ఈమె వెల్లడించారు. ఇక ఆయన నుంచి ఫోన్ వచ్చిందని తెలియగానే ఎంతో సంతోషపడ్డానని ఈ సందర్భంగా కృతి శెట్టి లింగుస్వామి గురించి వెల్లడించారు. ఇక ది వారియర్ సినిమా జూలై 14వ తేదీ రావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.