Chammak Chandra: అన్నం కోసం ఎదురుచూసా.. బయట కొనలేక నూకలు తిని బతికా..?

Chammak Chandra: నిజాంబాద్ జిల్లా బాన్సువాడలోని ఒక చిన్న తండా నుంచి వచ్చి ప్రస్తుతం బుల్లితెరపై హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జబర్దస్త్ ఫేమ్, కమెడియన్ చమ్మక్ చంద్ర. చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేదన్న ఆయన మెగాస్టార్ చిరంజీవి అన్నా, ఆయన డ్యాన్స్ అన్నా చాలా పిచ్చి అని, ఆ అభిమానమే ఆయనను ఇక్కడికి తీసుకు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

తన చిన్నతనంలో తన తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారని చమ్మక్ చంద్ర అన్నారు. పదవ తరగతిలో ఫెయిల్ అయిన తాను సినిమాలపై, నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చానని ఆయన తెలిపారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఇన్స్టిట్యూట్‌లో డాన్స్ మరియు నటనపై శిక్షణ తీసుకున్నానని, అక్కడే ధనరాజ్ కూడా పరిచయం అయ్యారని చంద్ర చెప్పారు.

ఆ తర్వాత కూడా తాను కష్టాలు అనుభవించానని చమ్మక్ చంద్ర అన్నారు. తన చిన్నతనంలో దీపం కూడా ఉండేది కాదని, తాను చదువుకోవాలనుకుంటే తన స్నేహితుల ఇళ్లకు వెళ్లి చదువుకునే వాడినని ఆయన తెలిపారు. తన ఇంట్లో చాలా సంవత్సరాలు కిరోసిన్ దీపం కిందనే గడిపినట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకానొక సందర్భంలో తన దగ్గర పది రూపాయలు ఉంటే పది రూపాయలకి పావుకిలో బియ్యం వచ్చేవని, నూకలు కొంటే కిలో వచ్చేవని ఆయన అన్నారు. బియ్యం రెండు రోజులొస్తే, నూకలు మాత్రం నాలుగు రోజులు వస్తాయని నూకలే కొనేవాడినని ఆయన వివరించారు. కొన్నిసార్లు తన ఇంటికి వెళ్లడానికి కూడా ఆలోచించే వాడిని ఎందుకంటే అక్కడికి వెళ్తే ఊర్లో వాళ్లంతా ఏం చేస్తున్నావ్ అని అడగడం భరించలేక వెళ్లడం కూడా కొన్ని రోజులు వెళ్లడం మానుకున్నానని ఆయన చెప్పారు. ఇక్కడికి వచ్చాక కూడా అవకాశాలేమీ అంత తొందరగా రాలేదని, ఎందుకంటే తనకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోవడం కూడా చాలా పెద్ద మైనస్ అయ్యిందని అని చెప్పుకొచ్చారు.