Big Boss OTT: నిజంగా చెప్పాలంటే బిగ్‌బాస్‌లోకి వెళ్లడం తనకు చాలా ఇష్టం అని, ప్రపంచాన్ని వదిలేసి అలా వెళ్లడం అనేది ఒక రీహబ్‌గా ఉంటుందని సింగర్ గీతా మాధురి అన్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ OTT కూడా త్వరలోనే ప్రారంభమవుతున్న సందర్భంలో ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అవకాశం వస్తే వెళ్లడం ఇష్టమేనన్న ఆమె, తన కెరీర్‌ను కూడా చూసుకోవాలి కదా అని సమాధానమిచ్చారు. తన ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని ప్లాన్ చేసుకోవాలని, అంతే కాకుండా తనకిప్పుడు పాప కూడా ఉంది కాబట్టి, అవన్నీ చూసుకొని సాగిపోతూ ఉన్నానని ఆమె చెప్పారు. ఏ టైం కి ఎలా చేంజ్ అవుతామో చెప్పలేం కదా, ఆ సమయానికి ఏం చేయాలనిపిస్తుందో అదే చేస్తానని ఆమె అన్నారు.
ఇకపోతే లాస్ట్ టైం టైటిల్ మిస్సయిందన్న ఆమె, ఈ సారి వెళ్లినా కూడా కప్ తనకు రాదని, ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ అయిపోయానని గీతా మాధురి అన్నారు. కాబట్టి ఎప్పుడైనా ఫ్రెష్ టాలెంట్‌కే కప్ వస్తుందని ఆమె స్పష్టం చేశారు. అందరినీ సెకండ్ టైం అవకాశం వచ్చి పోటీ పడితే అది వేరేలా ఉండేదని, కానీ ఇప్పుడు కొత్త వాళ్లను కూడా తీసుకొస్తున్నారు కాబట్టి, మమ్మల్ని బిల్డ్ చేస్తే కొత్త వాళ్లకు అన్యాయం చేసినట్టు అవుతుందని ఆమె చెప్పారు.
ఇక ఇప్పుడు కొత్తగా బిగ్‌బాస్ OTTలోకి వెళ్లే కంటెస్టంట్స్‌కు తాను చెప్పేదేంటంటే జాగ్రత్తగా ఉండండి, కెమెరాలు ఎప్పుడూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటాయి.. మీరు మీలా ఉండండి.. ఒక వారం వరకు ఉండగలరేమో గానీ, ఆ తర్వాత మాత్రం ఎవరైనా తమలానే ప్రవర్తిస్తారని గీతా మాధురి అన్నారు. కానీ మాట్లాడే ముందు చాలా ఆలోచించి మాట్లాడాలని, కాలు జారితే తీసుకోగలం గానీ, నోరు జారితే తీసుకోలేమని ఆమె హితబోధ చేశారు.