Niharika: ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రేక్షకులకు తండేల్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడికి వెళ్లినా ఈ సినిమా పాటలే మనకు వినపడుతూనే ఉన్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. నాగచైతన్య సినీ కెరియర్ లోనే మొదటి 100 కోట్ల బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం నిలిచిందని చెప్పాలి. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నాగచైతన్య అలాగే అక్కినేని అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రసారమవుతుంది. ప్రస్తుతం ఇక్కడ కూడా ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి నాగచైతన్య జోడిగా నటించారు అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఆప్షన్ సాయి పల్లవి కాదని తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించడం కోసం ముందుగా మేకర్స్ మెగా డాటర్ నిహారికను తీసుకోవాలని భావించారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా న్యాచురల్ గా ఉండాలి. ఈ క్రమంలోనే నిహారిక లుక్ టెస్ట్ చేయడంతో పెద్దగా సెట్ అవ్వకపోవడం వల్ల నిహారికను రిజెక్ట్ చేశారని తెలుస్తుంది అనంతరం కీర్తి సురేష్ ని కూడా ఎంపిక చేశారట. అక్కడ కూడా అదే పరిస్థితి కావడంతో చివరికి సాయి పల్లవినీ ఫైనల్ చేశారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్ అదిరిపోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ ముగ్గురిలో సాయి పల్లవి అయితేనే ఈ పాత్రకు పూర్తిస్థాయిలో జీవం పోస్తుందని అనిపించేలా సాయి పల్లవి నటించారు. ఇక సాయి పల్లవి కాకుండా ఈ సినిమాలో నిహారిక కనుక నటించి ఉంటే ఆమెకు కూడా మంచి సక్సెస్ వచ్చేదని ఈ సినిమా ద్వారా నిహారిక కెరియర్ మరో రేంజ్ కు వెళ్లిపోయేదని అభిమానులు భావిస్తున్నారు.