పార్టీలో నేనుండలేను.. ఏడ్చేసిన వైసీపీ ఎమ్మెల్యే

ycp party

 వైసీపీ పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ రాష్ట్రంలో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యే లు తమ పనులు సరిగ్గా జగరటం లేదని తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తుంది. బయటపడితే పార్టీ పరువు, తమ పరువు పోతుందని లోలోపలే ఇబ్బంది పడుతున్నారు. వైసీపీలో కొందరు ఎమ్మెల్యే పడే ఇబ్బందులు ఏమిటో కళ్లకుకట్టే ఘటన ఒకటి బయటకు వచ్చింది. ప్రకాశం జిల్లాకి సంబధించి డీఆర్ సి సమావేశం జరిగింది. ఇందులో జిల్లా ఇంచార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, స్థానిక ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొని, జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నా అభివృద్ధి పనులు గురించి, అదే విధంగా నియోజకవర్గాల సమస్య ల గురించి చర్చిస్తారు.  

ycp party

  ఈ మీటింగ్ లో వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ “నా కాళ్ల కింద తడినే నేను తుడుచుకోలేక పోతున్నాను. ఇక నేను ఎమ్మెల్యేగా ఉండడం ఎందుకు?“ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నా పరిస్థితే దారుణంగా ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించే మాట అటుంచితే.. నా చెప్పులో రాయినే నేను తీసుకోలేక పోతున్నాను. ఎందుకు నాన్నా.. నీకు ఎమ్మెల్యే పదవి.. రాజీనామా చేసేయ్! అని అబ్బాయి చెబుతున్నాడు. నాకు కూడా ఈ పరిస్థితి చూస్తే.. రాజీనామా కన్నా మరో మార్గం కనిపించడం లేదు“అని ఏకంగా ఆయన కన్నీటి పర్యంత మయ్యారట. దీనితో సమావేశంలో పాల్గొన్న నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే ఆ ఎమ్మెల్యే ను ఊరడించి అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు.

  “కరోనా నేపథ్యంలో పేషంట్లకు ఇవ్వమంటే.. మాకున్న కాలేజీని ప్రభుత్వానికి ఇచ్చాం. మన ప్రభుత్వమే కదా.. మళ్లీ మాకు యథాతథంగా అప్పగిస్తారని అనుకున్నాం. కానీ కరోనా పేషంట్ల కారణంగా కాలేజీ రూపు రేఖలే మారిపోయాయి. భారీ ఎత్తున నాశనం చేశారు. ఇప్పుడు కాలేజీని బాగు చేయించుకునేందుకు కోట్లలో ఖర్చవుతుంది. రేపో మాపో.. కాలేజీలు తీసేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇప్పుడు మా కాలేజీ పరిస్థితి ఏంటి? మన ప్రభుత్వమే కదా అని ఇస్తే.. వాడుకుని.. ఇప్పుడు కాలేజీ పాడైంది.. పట్టించుకుని బాగుచేయించండి అంటే.. వినేనాథుడు లేకుండా పోయాడు. మా బాధనే మేం సరిచేసుకోలేక పోతున్నప్పుడు మాకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? మా కుటుంబ సభ్యులు కూడా రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే కాలేజీనే వాడుకుని.. వదిలేస్తే.. నేను ఎవరికి ఏం చేయించగలను` అంటూ అసలు విషయాన్నీ చెప్పుకొచ్చాడు.

  దీనితో మంత్రులు వెంటనే స్పదించి అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి, కాలేజీ కి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని తగిన న్యాయం చేయాలనీ ఆదేశించి, ఆ ఎమ్మెల్యే ను బుజ్జగించారు, నిజానికి ఆ ఎమ్మెల్యే కు అది ఒకటే సమస్య కాదు, అనేక సమస్యలు నియోజకవర్గంలో ఎదురవుతున్నాయి. అక్కడి వైసీపీ ఇంచార్జితో ఎమ్మెల్యేకు అసలు పొసగటం లేదని తెలుస్తుంది. ఇంఛార్జి తనుకున్న పరిచయాలతో ఎమ్మెల్యేను ఇరుకున పెడుతూ, అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు స్థానిక నేతలు చెపుతున్నారు.. ఆ ఇబ్బందులు తట్టుకోలేకనే పార్టీ నుండి వెళ్లిపోవాలని ఎమ్మెల్యే భావించినట్లు తెలుస్తుంది.