టీడీపీలోకి వెళ్లకపోవటం వల్లే ఈరోజు ఈ పదవిలో ఉన్నాను: ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర

తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పీడిక రాజన్న దొర కొన్ని విషయాలు బయట పెట్టాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనను ఆ పార్టీలో చేర్చటానికి ఆ పార్టీ వాళ్లు బేరం పెట్టారు అని అన్నారు. పిల్లల చదువులతో పాటు రూ.30 కోట్ల, మంత్రి పదవి, అమరావతిలో ఇల్లు ఇస్తామని అన్నారట.

కానీ తనకు తన నాయకుడు జగన్ పై ఉన్న నమ్మకం, అభిమానంతో పార్టీ మారలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లకపోవటం వల్లే తాను ఈరోజు మంచి పదవిలో ఉన్నాను అని అన్నారు. ఇక తనకు మొదటిసారి మంచి పదవి రానందుకు అసంతృప్తి లేదు అని అన్నారు. టీవీలో, పేపర్లో వస్తున్న మాటలలో నిజం లేదని ప్రజలు తెలుసుకోవాలి అని అన్నారు.